News April 11, 2025

సిద్దిపేట: ఈవీఎం గోదాం చుట్టు 24/7 బందోబస్తు: కలెక్టర్

image

సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ పక్కన గట ఈవీఎం గోదాంను కలెక్టర్ మనుచౌదరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నెలవారీ పరిశీలనలో భాగంగా గోదాం చుట్టూ తిరిగారు. లాగ్ బుక్ చెక్ చేసి విజిటర్స్ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం చుట్టు సీసీ కెమెరాల పనితీరు, పోలీస్ అధికారుల 24/7 బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

Similar News

News July 5, 2025

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 108.2 మి.మీ వర్షపాతం

image

గడిచిన 24 గంటల్లో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 108.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారీగా చూస్తే మహదేవ్‌పూర్ 9.2 మి.మీ, పలిమెల 32.8, మహముత్తారం 42.4, కాటారం 3.6, మల్హర్ 10.4, చిట్యాల 3.2, టేకుమట్ల 1.0, రేగొండ 1.4, భూపాలపల్లి 4.2 మి.మీ.లుగా నమోదైంది.

News July 5, 2025

పల్నాడు: మళ్లీ పెరుగుతున్న టమాటా ధరలు

image

ఇటీవల తగ్గిన కూరగాయల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు రోజుల కిందట రైతు బజార్లలో కిలో రూ.18 ఉన్న టమాటా శనివారానికి రూ.35కి చేరింది. రిటైల్ మార్కెట్‌లో ఈ ధర మరింత అధికంగా ఉంది. పచ్చిమిర్చి రూ.38, వంకాయ రూ.36, దొండ రూ.38, బెండ రూ.27 పలుకుతున్నాయి. మీ ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News July 5, 2025

ప్రభుత్వ సలహాదారునిగా పి.గన్నవరం వాసి బాధ్యతలు

image

పి. గన్నవరంలోని ఊడిమూడికి చెందిన జనసేన పార్టీ నాయకుడు పెన్నమరెడ్డి నాగబాబు ఇటీవల అటవీ శాఖ ఐటీ ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన అమరావతిలోని సచివాలయం వద్ద శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. తనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పగించిన బాధ్యతను నెరవేర్చేందుకు కృషి చేస్తానని నాగబాబు తెలిపారు.