News December 5, 2025
సిద్దిపేట: ఉమిద్ పోర్టల్‌లో ఆస్తుల నమోదు

ఉమిద్ పోర్టల్‌లో ఎండోమెంట్ ఆస్తుల నమోదును ప్రక్రియ సిద్దిపేట జిల్లా జమియత్ ఉలేమా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఉమిద్ పోర్టల్‌పై నెల రోజుల నుంచి సిద్ధిపేట అధ్యక్షుడు ముఫ్తీ అబ్దుల్ సలాం ఖాస్మి చుట్టుపక్కల మండలాల ప్రజల్లో అవగాహన కల్పించారు. జిల్లాలోని పలు మండలాల యువత, నాయకులు తమ వద్ద ఉన్న వక్ఫ్ ఆస్తి పత్రాలను పోర్టల్‌లో నమోదు చేశారు.
Similar News
News March 6, 2026
హనుమకొండ: తండ్రి ఎస్ఐ.. కొడుకు ఐపీఎస్

హనుమకొండ జిల్లాకు చెందిన అఖిలేశ్ గుండు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2025 ఫలితాల్లో 464వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. భూపాలపల్లి ఎస్ఐ గుండు శివ కుమార్, సరస్వతి దంపతుల కుమారుడైన అఖిలేశ్ ప్రాథమిక విద్యను వరంగల్ పబ్లిక్ స్కూల్‌లో, ఇంటర్మీడియట్ ఎస్‌ఆర్‌లో, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సివిల్ ఇంజినీరింగ్ పట్టా పొందారు. మరోసారి ప్రయత్నించి కలెక్టర్ కావాలనేది తన లక్ష్యమన్నారు.
News March 6, 2026
చీకటిని చీల్చుతూ ఉదయించిన ‘రవి’కిరణుడు❤️

ఇవాళ రిలీజైన UPSC ఫలితాల్లో రాణించిన బిహార్‌కు చెందిన రవి రాజ్ స్పెషల్. తన చిన్నతనంలోనే చూపు కోల్పోయినా పట్టుదలతో చదివి 20వ ర్యాంకు సాధించి IAS అధికారి కాబోతున్నారు. ఈ ప్రయాణంలో తల్లి విభ ఆయనకు దిక్సూచిగా మారారు. ఆమె పుస్తకాలు చదివి వినిపిస్తూ, నోట్స్ రాస్తూ కుమారుడిని ప్రోత్సహించారు. ఇప్పటికే BPSC సాధించి.. పట్టుదలకు అమ్మ ప్రేమ తోడైతే గెలుపు సాధ్యమేనని రవి ప్రపంచానికి చాటిచెప్పారు.
News March 6, 2026
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియామక ప్రతిపాదనకు అధిష్ఠానం ఆమోదం తెలిపింది. ఈ నియామకాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమోదించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నియామకంపై నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.


