News April 7, 2025
సిద్దిపేట: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

తాగిన మైకంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. ఎల్ బంజరుపల్లి గ్రామానికి చెందిన బొమ్మ రాజు (35) కుమ్మరి పని చేస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే పనికి వెళ్లిన సరితా ఇంటికి తిరిగి వచ్చే వరకు రాజు ఇంట్లో ఉరి వేసుకున్నట్టు తెలిపింది. ప్రతి రోజు మద్యం సేవించి వచ్చేవాడని రాజు భార్య సరితా పోలీసులకు తెలిపింది.
Similar News
News April 9, 2025
HYD: పుణ్యక్షేత్రాల గురుకృప టూర్ ఇలా..!

వేసవి వేళ పుణ్యక్షేత్రాల దర్శనం కోసం SCR గురుకృప టూర్ కోసం రైల్వే సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గురుకృప టూర్ ఈ సారి విజయవాడ నుంచి ప్రారంభమై గుంటూరు → నల్లగొండ → సికింద్రాబాద్ → కాజీపేట → పెద్దపల్లి → మంచిర్యాల → సిర్పూర్ కాగజ్‌నగర్ → బల్లార్షా → వార్దా → నాగ్‌పూర్ ప్రాంతాల మీదుగా జరగనున్నట్లు వెల్లడించారు.
News April 9, 2025
HYD: సమ్మర్ స్పెషల్.. యాత్రలకు స్పెషల్ ప్యాకేజీ!

SCR అధికారులు ‘భారత్ గౌరవ్’ వేసవి ప్రత్యేక రైళ్లను నడపడానికి సిద్ధమయ్యారు. ప్యాకేజీ-1 కింద హరిద్వార్- రిషికేష్- వైష్ణోదేవి యాత్రకు ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు రైళ్లను నడపనున్నట్లు పేర్కొన్నారు. టిక్కెట్ ధర రూ.18,510 నుంచి ప్రారంభం అవుతుందని వెల్లడించారు. HYD నగర వాసులు సైతం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News April 9, 2025
కృష్ణా: డిగ్రీ పరీక్షల రివైజ్డ్ టైమ్ టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో UG కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ (రెగ్యులర్& సప్లిమెంటరీ) పరీక్షల రివైజ్డ్ టైమ్ టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 21 నుంచి మే 2 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. టైమ్ టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్ సైట్ చూడాలని కోరారు.