News November 22, 2025
సిద్దిపేట: ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష

గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియపై కలెక్టర్ హేమావతి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పంచాయతీ శాఖ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధన మేరకు జిల్లాలో గల 508 గ్రామపంచాయతీలు, 4508 వార్డులలో రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టాలని సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో 2011 సెన్సెస్ ప్రకారం చేపట్టాలని, 50% రిజర్వేషన్లు మించకుండా చేయాలన్నారు.
Similar News
News November 24, 2025
బీసీలకు రాహుల్ గాంధీ అన్యాయం: కేటీఆర్

తెలంగాణ బీసీలకు రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతామని KTR అన్నారు. ‘ఆయన వెంటనే BC రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంటులో చర్చకు వచ్చేలా చూడాలి. BJP సహకరించకుంటే ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలి. స్థానిక సంస్థల రిజర్వేషన్ల చుట్టే మొత్తం అంశాన్ని తిప్పుతూ బీసీల విద్య, ఉపాధి, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్ ఇచ్చే అంశాన్ని పక్కనపెట్టారు’ అని కార్యకర్తల సమావేశంలో విమర్శించారు.
News November 24, 2025
జిల్లా పోలీస్ కార్యాలయానికి 62 ఆర్జీలు: SP

బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 62 ఆర్జీలు వచ్చినట్లు SP ఉమామహేశ్వర్ చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నేరుగా ఆయన వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరించి నివేదిక అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు.
News November 24, 2025
మల్యాల: ‘రెండోసారి అధికారంలోకి వచ్చాక మహిళలందరికీ పట్టుచీరలు’

రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళలందరికీ పట్టుచీరలు అందజేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. ఇవాళ సాయంత్రం మల్యాలలో ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్ప చేసిందని ఆరోపించారు.


