News February 18, 2025
సిద్దిపేట: ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.మను చౌదరి అన్నారు. ఈనెల 27వ తేదీన జరగనున్న కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రులు, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ఎన్నికల పీఓ, ఏపీఓలకు శిక్షణను ఇచ్చారు.
Similar News
News July 5, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News July 5, 2025
ఓదెల: ప్రభుత్వ పాఠశాలల ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

ఓదెల మండలంలోని పాఠశాలల పనితీరుపై కలెక్టర్ కోయ శ్రీ హర్ష హెడ్‌మాస్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వార్షిక ప్రణాళికను అమలు చేయాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మ్యాథ్స్, ఆంగ్లం, తెలుగు విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలని అన్నారు. టీచర్ల హాజరు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నమోదు చేయాలని, పాఠశాలల మౌలిక వసతుల కోసం ప్రతిపాదనలు పంపించాలని, హాజరును 60%కి పెంచాలని ఆదేశించారు.
News July 5, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (జులై 5, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.25 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.16 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.