News December 1, 2025

సిద్దిపేట: ఎయిడ్స్ వ్యాధికి నివారణే ఆయుధం: DMHO

image

ఎయిడ్స్ వ్యాధికి నివారణ ఒక్కటే ప్రధాన ఆయుధం అని సిద్దిపేట DMHO ధనరాజ్ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ ప్రివెన్షన్ డే సందర్బంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చెసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధి అవగాహనతోనే నివారించవచ్చాన్నారు.

Similar News

News April 8, 2026

మెదక్: మోటార్ వేస్తుండగా విద్యుత్‌ షాక్‌తో మృతి

image

విద్యుత్‌ షాక్‌ తగిలి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామంలో విషాదం నింపింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. జగ్గంపేట సుధాకర్ (29) బుధవారం ఉదయం ఇంటి నల్లా నీటి కోసం మోటార్‌ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ప్రైవేట్ పరిశ్రమలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య కల్పన, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

News April 8, 2026

WGL: రోగులకు ప్రిస్కిప్షన్ ఇవ్వడం లేదంటూ లేఖ

image

రోగులకు ఏ మాత్ర, ఏ సమయంలో వేసుకోవాలో తెలిసేలా ప్రైవేట్ డాక్టర్లు ఇచ్చే మాదిరిగా ప్రిస్కిప్షన్ ఇవ్వాలంటూ ఓ వ్యక్తి MGMలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెలో లేఖ వేశారు. MGMలో సదుపాయాలపై ఫిర్యాదుల పెట్టెను WGL కలెక్టర్ సత్యశారద ఏర్పాటు చేశారు. ఈ పెట్టెను తనిఖీలను వచ్చిన రోజు తీయడంతో లేఖ వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. వెంటనే కలెక్టర్.. రోగులకు ఏ మాత్ర ఎప్పుడు వేసుకోవాలో తెలిసేలా ఇవ్వాలని ఆదేశించారు.

News April 8, 2026

చిత్తూరు జిల్లాలో అదనంగా కోర్టులు.. కొత్త ఉద్యోగాలు!

image

APలో కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా చిత్తూరు జిల్లాలో 6 కోర్టులు రానున్నాయి. చిత్తూరులో 7వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు, మదనపల్లెలో మూడో అదనపు సివిల్ కోర్టు, పలమనేరులో మొదటి అదనపు సివిల్ కోర్టు, రెండో అదనపు సివిల్ కోర్టు, పుంగనూరులో రెండో అదనపు సివిల్ జడ్జి కోర్టు, వాయల్పాడులో మొదటి అదనపు సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కానుంది. వీటితో కొత్త ఉద్యోగాలు వస్తాయి.