News December 28, 2025

సిద్దిపేట: ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష

image

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో సమావేశ మందిరంలో సిద్దిపేట మున్సిపల్ సంబంధించి పోలింగ్ స్టేషన్ లా వారిగా ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియపైన సూపర్ వైజర్, బీఎల్ఓలతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్షా నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలక్టోరల్ రోల్ మ్యాపింగ్ 100 శాతం పూర్తి చేయాలని బీఎల్ఓలను ఆదేశించారు. 18 సంవత్సరాల నిండిన ఓటర్ వెరిఫై చేయాలని సూచించారు.

Similar News

News December 28, 2025

నంద్యాల: విషాదం.. ఇద్దరు పిల్లల్ని తోసేసి తల్లి సూసైడ్

image

నంద్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. SRBC కాలువలో పిల్లలను తోసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గడివేముల మండలం మంచాలకట్ట సమీపంలోని కాలువ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. మృతులు ఒండుట్లకు చెందిన లక్ష్మీదేవి, వైష్ణవి(4), సంగీత(5 నెలలు)గా తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News December 28, 2025

వైద్యం అందక భారత సంతతి వ్యక్తి మృతి.. మస్క్ ఆగ్రహం

image

కెనడాలో సరైన చికిత్స అందక భారత సంతతి వ్యక్తి ప్రశాంత్ శ్రీకుమార్(44) మృతి చెందడంపై ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. తీవ్రమైన ఛాతీ నొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన ప్రశాంత్‌ను 8 గంటలపాటు వెయిట్ చేయించారు. దీంతో కెనడా హెల్త్‌కేర్ సిస్టంను US మోటార్ వెహికిల్ డిపార్ట్‌మెంట్‌తో పోల్చుతూ విమర్శలు గుప్పించారు. మరోవైపు కెనడా ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యత వహించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది.

News December 28, 2025

గూడెం కొత్తవీధి: ఆరో తరగతి విద్యార్థిని మృతి

image

గూడెం కొత్తవీధి మండలం సీలేరు బాలికల ఆశ్రమ పాఠశాలలో విషాదం నెలకొంది. ఆరో తరగతి చదువుతున్న పాంగి నిర్మల (11) ఆదివారం అకస్మాత్తుగా మరణించింది. శనివారం జ్వరంతో బాధపడగా చికిత్స చేయించారు. ఆదివారం పాఠశాలలో ఒక్కసారిగా పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యాధికారి నారాయణరావు ధృవీకరించారు. చిన్న వయసులోనే విద్యార్థిని మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.