News November 27, 2025

సిద్దిపేట: ఏకగ్రీవ ఎన్నికకు ప్రయత్నాలు!

image

సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నికల కోసం అనేక గ్రామాల్లో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఏకగ్రీవం అయిన పంచాయతీలకు రూ.10 లక్షల నజరానా ప్రకటించిన నేపథ్యంలో, పోటీలో నిలవాలనుకుంటున్న అభ్యర్థులతో కలిసి పెద్ద నాయకులు మంతనాలు జరుపుతున్నారు. ఇతర పోటీదారులు రంగంలోకి దిగకుండా ఉండేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Similar News

News November 28, 2025

సికిల్‌సెల్, తలసేమియా రోగుల కోసం ప్రత్యేక శిబిరాలు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సికిల్‌సెల్, తలసేమియా దీర్ఘకాలిక రక్త వ్యాధులతో బాధపడుతున్న రోగుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరాలను ఈ నెల 29న (శనివారం) ఉదయం 8 గంటలకు అశ్వారావుపేటలో, మధ్యాహ్నం 12:30 గంటలకు నారాయణపురంలోని రైతు వేదికల్లో నిర్వహించనున్నారు.. రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

నేడు కామారెడ్డికి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న PDSU 23వ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య హాజరుకానున్నారు. PDSU జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. జిల్లాలోని పీడీఎస్‌యూ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై, మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.