News February 25, 2025
సిద్దిపేట: ఏడుపాయల జాతరకు భారీగా బస్సులు

ఏడుపాయల జాతరకు భారీగా ఆర్టీసీ బస్సులను అధికారులు నడపనున్నారు. ఈ నెల 26 నుంచి 28 తేదీ వరకు మూడు రోజుల పాటు ఏడుపాయల జాతర కొనసాగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, జేబీఎస్ నుంచి 300 బస్సులు, పటాన్‌చెరు, నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోల నుంచి మరో 50 చొప్పున మొత్తం 400 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు నడపనున్నారు. రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Similar News
News February 25, 2025
28న తిరుపతిలో జాబ్ మేళా

APSSDC ఆధ్వర్యంలో తిరుపతిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(NAC)లో ఈనెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. 2 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. నిరుద్యోగ అభ్యర్థుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News February 25, 2025
పార్వతీపురం మన్యం జిల్లాల్లో మహాశివరాత్రి శోభ

పార్వతీపురం మన్యం జిల్లాల్లో మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు ముస్తాబయ్యాయి. జిల్లాలో కొమరాడ మండలంలో గుంప సోమేశ్వర ఆలయం, సాలూరు సమీపంలో పారమ్మకొండ, పార్వతీపురం సమీపంలో గల అడ్డాపుశీల, మక్కువ సమీపంలో గలగల ఉమా శాంతేశ్వర ఆలయం, ములక్కాయవలస ఆలయాలతో పాటు పలు ఆలయాలు ఉన్నాయి. మరి మీ ప్రాంతంలో ఉన్న శివాలయాలను కామెంట్ చేయండి.
News February 25, 2025
MNCL: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నగదు జమ

మంచిర్యాల జిల్లాలోని రైతుల ఖాతాల్లో 19వ విడత పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు నగదు జమ చేసింది. జిల్లాలోని అర్హులైన రైతులకు ప్రతి ఏడాది మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున రూ.6 వేలు జమ చేస్తోంది. ఇప్పటి వరకు 17వ విడతలో 55,658 మంది రైతులకు, 18వ విడతలో 40,534 మంది ఖాతాల్లో నగదు జమ కాగా.. ఈ విడతలో 56 వేల మంది వరకు రైతుల ఖాతాల్లో జమ కానుంది.