News December 18, 2025
సిద్దిపేట: ఒక్క ఓటుతో గెలుపు.. రికౌంటింగ్

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థులు కర్రోళ్ల నాగరాజు, కొయ్యడ వెంకటేశం మధ్య ఒక్క ఓటు తేడా రావడంతో అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ మద్దతుదారు వెంకటేశం సమీప ప్రత్యర్థి పై ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News December 18, 2025
NLG: ముగిసిన పల్లె సంగ్రామం

నల్గొండ జిల్లాలో గ్రామీణ సంగ్రామం ముగిసింది. నెల రోజుల పాటు కొనసాగిన ప్రక్రియ నిన్నటితో పరిసమాప్తం అయింది. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సహకరించిన వారందరికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ధన్యవాదాలు తెలిపారు.
News December 18, 2025
తెలుగు రాష్ట్రాల్లో సీఈసీ పర్యటన

CEC జ్ఞానేశ్ కుమార్ 3 రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రేపు 12PMకు HYD చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి శ్రీశైలం వెళతారు. 20న మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని మహా హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. 21న HYD రవీంద్ర భారతి ఆడిటోరియంలో TG BLOలతో సమావేశమై ఎన్నికల ప్రక్రియపై దిశానిర్దేశం చేస్తారు. కాగా ఈ పర్యటనలో ఆయన గోల్కొండ, చార్మినార్ వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది.
News December 18, 2025
విజయవాడలో రూ.150 కోట్ల ప్రాపర్టీ కాజేసే కుట్ర: జగన్

విజయవాడ జోగినగర్లో ఇళ్ల కూల్చివేతపై మాజీ సీఎం జగన్ స్పందించారు. 25 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్న 42 కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు. దాదాపు రూ.150 కోట్ల విలువైన భూమి విషయంలో ప్రైవేట్ వ్యక్తులకు సానుకూలంగా ఉండేలా వ్యవహరించారని ఆరోపించారు. సుప్రీంలో కేసు ఉండగానే ఇళ్ల కూల్చివేత దుర్మార్గమన్నారు. ఈ వివాదంలో ఎంపీ కేశినేని చిన్ని, జనసేన లోకల్ కార్పొరేటర్ పాత్రపై విచారణ జరిపి.. బాధితులకు న్యాయం చేయాలన్నారు.


