News December 23, 2025
సిద్దిపేట: ‘ఓటర్ జాబితా సవరణ ఎంట్రీలు పూర్తి చేయండి’

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలు, ఓటరు మ్యాపింగ్ తదితర అంశాలపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News December 27, 2025
ఖమ్మం: సొంత పార్టీ నేతలపైనే ‘హస్తం’ ఎమ్మెల్యేల ఫిర్యాదు

ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీలో ఉంటూనే ప్రత్యర్థి వర్గాలకు సహకరించారని వారిపై పలువురు MLAలు ఏఐసీసీకి ఫిర్యాదు చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇప్పటికే MLAలు మట్టా రాగమయి దయానంద్, పాయం వెంకటేశ్వర్లు, మాజీ MLA పొదెం వీరయ్య బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఇదే అంశాన్ని CM, Dy.CM దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం.
News December 27, 2025
H1B వీసా జాప్యాన్ని US దృష్టికి తీసుకెళ్లిన భారత్

H1B వీసా జారీలో ఆలస్యం, అపాయింట్‌మెంట్ల రద్దు అంశాలను US దృష్టికి తీసుకెళ్లినట్లు MEA అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ అంశం ఆ దేశ సార్వభౌమాధికారానికి చెందినదైనా.. వీసా అపాయింట్‌మెంట్ షెడ్యూల్, రీషెడ్యూలింగ్‌లో ఇబ్బందులపై వచ్చిన అనేక ఫిర్యాదుల గురించి తెలియజేశామన్నారు. వీసా ప్రాసెసింగ్ జాప్యం వల్ల పలువురి కుటుంబ జీవితానికి, వారి పిల్లల చదువుకు ఇబ్బందులు ఏర్పడినట్లు జైస్వాల్ చెప్పారు.
News December 27, 2025
GNT: మంత్రి పేరిట మోసం.. రూ.1.15 కోట్లు టోకరా.!

మంత్రి కొల్లు రవీంద్రకు ఏజెంట్లుగా పనిచేస్తున్నాం.. లిక్కర్ మార్ట్ మంజూరు చేయిస్తామంటూ రూ.1.15 కోట్లు వసూలు చేసిన వంకాయలపాటి రాంబాబు, సాయికిరణ్‌పై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. SVN కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు నుంచి నిందితులు డబ్బులు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా లిక్కర్ మార్ట్ మంజూరు కాలేదు. బాధితుడు మంత్రిని కలవగా వారు తనకు తెలియదని చెప్పడంతో మోసపోయానని బాధితుడు ఫిర్యాదు చేశాడు.


