News February 4, 2025

సిద్దిపేట కమిషనరేట్‌లో 544 అవగాహన కార్యక్రమాలు

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో వాహనదారులకు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి 544 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు సీపీ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. అవేర్నెస్ కార్యక్రమంలో రాష్ట్రంలో మూడో స్థానం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ నిలిచిందని తెలిపారు. ప్రజలు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.

Similar News

News September 17, 2025

జాతీయ స్థాయిలో మెదక్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్

image

జాతీయ స్థాయి కరాటే పోటీలలో మెదక్ విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించినట్లు రెంజుకి షోటోకాన్ కరాటే వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ మాస్టర్ నగేశ్ తెలిపారు. ముంబైలో జాతీయస్థాయి కరాటే పోటీలు జరగగా మెదక్ పట్టణానికి చెందిన విద్యార్థులు బ్లాక్ బెల్ట్ విభాగంలో అండర్ -13 స్వరూప్ సింగ్, అండర్-16 అబ్దుల్లా,
అండర్-17లో సూరజ్ గోల్డ్ మెడల్స్‌తో పాటు ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు.

News September 17, 2025

మరికొన్ని గంటల్లో మ్యాచ్.. పాక్ ఆడుతుందా?

image

ఆసియా కప్‌లో పాకిస్థాన్ కొనసాగడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. షేక్‌హ్యాండ్ వివాదంలో <<17723523>>పాక్ డిమాండ్‌<<>>ను ICC తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే UAEతో మ్యాచ్‌లో దాయాది దేశం ఆడుతుందా? టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుందా? అనే ప్రశ్న వినిపిస్తోంది. ప్రీ మ్యాచ్ మీడియా కాన్ఫరెన్స్‌ క్యాన్సిల్ చేసుకోగానే తప్పుకుంటారని అంతా అనుకున్నారు. కానీ, తర్వాత నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనడంతో సందిగ్ధత కొనసాగుతోంది.

News September 17, 2025

US జోక్యాన్ని భారత్ ఒప్పుకోలేదు: పాకిస్థాన్

image

OP సిందూర్‌ నిలిపివేయడం వెనుక అమెరికా హస్తంలేదని తాజాగా పాక్ ఉప ప్రధాని మహ్మద్ ఇషాక్ దార్ ఒప్పుకున్నారు. ‘మేము US విదేశాంగ మంత్రి మార్క్ రూబియోతో తృతీయ పక్షం జోక్యం గురించి చెప్పాం. బయటి వ్యక్తుల ప్రమేయానికి భారత్ ఒప్పుకోవట్లేదని ఆయన మాతో చెప్పారు. వాష్గింగ్టన్‌లో మళ్లీ నేను అదే ప్రస్తావించాను. ఇది పూర్తిగా ద్వైపాక్షికంగానే పరిష్కారమవ్వాలని ఇండియా తెగేసి చెప్పినట్లు బదులిచ్చారు’ అని తెలిపారు.