News February 26, 2025
సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో అనుమతులు తప్పనిసరి: CP

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ర్యాలీలు, ధర్నాలు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సీపీ డాక్టర్ బి. అనురాధ సూచించారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 14 వరకు జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని, కావున ర్యాలీలు, ధర్నాలు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు.
Similar News
News February 26, 2025
కాళేశ్వరంలో పూజలు చేసిన మాజీ మంత్రి

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వీరు ఆలయం వద్దకు రాగా ఆలయ అర్చకులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆలయంలో దర్శించుకున్నాక ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. మీరు వెంట మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, నాయకులు రాకేశ్ తదితరులు ఉన్నారు.
News February 26, 2025
ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించిన WGL కలెక్టర్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను కలెక్టర్ సత్య శారద సందర్శించారు. 6 రూట్స్ ద్వారా 13 కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని పంపనున్నారు. పోలింగ్ సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వాహనాల్లో వెళ్లిపోయారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రతిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని అన్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
News February 26, 2025
అల్లూరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేపు(గురువారం) పాడేరు డివిజన్లో అన్ని విద్యా సంస్థలకు స్థానిక సెలవుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలో పోలింగ్ కేంద్రాలు కేటాయించిన భవనాలు ఉన్న సంస్థలకు సెలవు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అన్ని యాజమాన్య పాఠశాలలు ఆదేశాలు పాటించాలని సూచించారు.