News April 18, 2025

సిద్దిపేట: కరెంట్ షాక్‌తో బాలుడి మృతి

image

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి ఆరో తరగతి విద్యార్ధి సాయి ప్రణీత్(12) మృతి చెందిన ఘటన తోగుట మండలం తుక్కాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామంలోని దేవాలయంలో జరిగే ఉత్సవాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ పోల్‌ను అనుకోకుండా తగలడంతో సాయి ప్రణీత్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తండ్రి స్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 19, 2025

జగిత్యాల: పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టండి: ఎస్పీ

image

గ్రామాల్లో చెరువులు, కుంటలు, బావులల్లో ఈతకు వెళ్లే పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. శనివారం జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. సరదా కోసం ఈతకు వెళ్తే కొందరు ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు జరిగాయని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా ఈత నేర్చుకునే పిల్లలు తల్లిదండ్రులతో వెళ్ళాలన్నారు.

News April 19, 2025

10 రోజుల్లో రూ.4,200 పెరిగిన గోల్డ్ రేటు

image

శుభకార్యాల వేళ బంగారం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. గత పది రోజుల్లోనే తులం బంగారంపై రూ.4,200లు పెరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలతో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. అయితే, మూడు రోజులకే టారిఫ్స్ హోల్డ్ చేయడంతో రాకెట్‌లా దూసుకెళ్లాయి. ఈనెల 10న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.93,380 ఉండగా ఇవాళ అది రూ.97,580కి చేరింది. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.89,450గా ఉంది.

News April 19, 2025

కొల్లాపూర్‌లో ప్రజల నుంచి వినతుల స్వీకరించిన మంత్రి 

image

కొల్లాపూర్ పట్టణంలోని కేఎల్ఐ గెస్ట్ హౌస్‌లో శనివారం ఉదయం వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి జూపల్లి వినతులు స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు సమస్యలతో వచ్చినప్పుడు అధికారులు పరిష్కరించాలన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలు అధికారుల చుట్టూ తిరగొద్దన్నారు. ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

error: Content is protected !!