News March 19, 2025

సిద్దిపేట: కస్తూర్భాను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

image

చేర్యాల మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తనిఖీ చేశారు. అనంతరం టెన్త్ క్లాస్ విద్యార్థినులకు కాసేపు పాఠాలు బోధించారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శ్రద్ధతో చదవాలని, ఎలాంటి సందేహాలు ఉన్నా ఉపాధ్యాయులతో చర్చించి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వసతి రూం, కిచెన్ సందర్శించి మెనూ ప్రకారమే నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపల్ కు సూచించారు.

Similar News

News November 8, 2025

తాళ్లపూడి: యాసిడ్ పడి ఇద్దరికి గాయాలు

image

తాళ్లపూడి మండలం పైడిమెట్టలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గోతులమయమైన రహదారిపై వెళ్తున్న యాసిడ్ ట్యాంకర్ నుంచి కుదుపులకు యాసిడ్ లీకైంది. అది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిపై పడటంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

News November 8, 2025

చంద్రుడిపై నీరు, మంచు జాడను కనుగొనడంలో కీలక ముందడుగు!

image

2019లో చంద్రుడిపైకి పంపిన చంద్రయాన్-2 తన మిషన్‌ను కొనసాగిస్తోంది. అహ్మదాబాద్‌లోని ఇస్రో SAC సైంటిస్టులు దాని DFSA రాడార్ నుంచి ఎప్పటికప్పుడు డేటాను విశ్లేషిస్తున్నారు. సుమారు 1,400 రాడార్ డేటాసెట్స్‌ను కలెక్ట్ చేసి ప్రాసెస్ చేశారు. తొలిసారి చంద్రుడి పూర్తి పొలారిమెట్రిక్, L-బ్యాండ్ రాడార్ మ్యాప్‌లను రూపొందించారు. ఇది చంద్రుడి ఉపరితలంపై నీరు, మంచు జాడలను కనుగొనేందుకు దోహదపడనుందని భావిస్తున్నారు.

News November 8, 2025

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

ఇంకొల్లు మండలం ఇడుపులపాడులోని చెరువులో 16 ఏళ్ల యువకుడు ఈతకు వెళ్లి గల్లంతైన ఘటన తెలిసిందే. ఉదయం 10 గంటల సమయంలో స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లిన అతను బయటకు రాలేదు. అగ్నిమాపక సిబ్బంది బోటు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా, శనివారం రాత్రి యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.