News January 14, 2026

సిద్దిపేట: ‘కుల వివక్షతో యువ డాక్టర్ ఆత్మహత్య’

image

సిద్దిపేట మెడికల్ కాలేజీలో 4వ సంవత్సరం చదువుతున్న డాక్టర్ లావణ్య ఆత్మహత్య ఘటన సంచలనం సృష్టించింది. సీనియర్ డాక్టర్ ప్రణయ్ ప్రేమ పేరుతో మోసం చేసి, పెళ్లి ప్రస్తావన రాగానే కులం పేరుతో నిరాకరించడంతో ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై ఎమ్మార్పీఎస్, డీబీఎఫ్ నాయకులు అదనపు కలెక్టర్‌ను కలిసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.

Similar News

News February 12, 2026

కృష్ణా: పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో B.A.LL.B చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదలైంది. FEB 20, 23, 25, 27 తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 70 మార్కులకు వర్శిటీ పరిధిలోని కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు.

News February 12, 2026

VIRAL: ₹300తో కొని ₹634కోట్లకు అమ్మాడు!

image

మలేషియాకు చెందిన కింగ్ అర్స్యాన్ ఇస్మాయిల్ 1993లో కేవలం ₹300తో ‘ai.com’ అనే డొమైన్‌ను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఏఐకి పెరిగిన క్రేజ్ వల్ల ఈ డొమైన్‌ను ఇస్మాయిల్ ఒక క్రిప్టో సంస్థకు ఏకంగా ₹634 కోట్లకు విక్రయించారు. కామ్‌ వ్యవస్థాపకుడు క్రిస్ మార్జాలెక్ ఈ డొమైన్‌ను దక్కించుకున్నారు. గతంలో దీనిని ‘OpenAI’ కూడా వాడుకుంది. అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభం పొందిన అరుదైన డీల్‌గా ఇది నిలవడం విశేషం.

News February 12, 2026

పవన్ కళ్యాణ్‌ను కలిసిన బాలకృష్ణ

image

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆయన పేషీలో కలిశారు. నియోజకవర్గ అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.