News April 19, 2025

సిద్దిపేట కూతురు నిశ్చితార్థం.. ఉరేసుకుని తండ్రి ఆత్మహత్య

image

కూతురు నిశ్చితార్థం రోజు తండ్రి సూసైడ్ చేసుకున్న విషాదకర ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. గౌరారం ఎస్‌ఐ కరుణాకర్ రెడ్డి వివరాలిలా.. వర్గల్ మండలం తునికి కాల్సా గ్రామానికి చెందిన కొడగల్లా అంజయ్య(57)కు ఇద్దరు కూతుళ్లు. అప్పుచేసి పెద్దకూతురు వివాహం చేయగా చిన్న కుమార్తె పెళ్లి కుదిరింది. శుక్రవారం జరగాల్సిన నిశ్చితార్థానికి అప్పు పుట్టకపోవడంతో మానసిక క్షోభకు గురై గ్రామ సమీపంలో చెట్టుకు ఉరేసుకున్నాడు.

Similar News

News April 19, 2025

విశాఖ అభివృద్ధే సీఎం లక్ష్యం: మంత్రి డోలా

image

వైసీపీ 5 ఏళ్ల పాలనలో జీవీఎంసీలో జరిగిన అభివృద్ధి శూన్యమని విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్వామి అన్నారు. శనివారం ఆయన జీవీఎంసీలో మేయర్‌పై అవిశ్వాసం నెగ్గిన సందర్భంగా కూటమి కార్పొరేటర్లతో కలిసి మాట్లాడారు. వైసీపీ అరాచకాలు అడ్డుకునేందుకే కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారని పేర్కొన్నారు. విశాఖను అన్ని విధాల అభివృద్ధి చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం అన్నారు.

News April 19, 2025

సిరిసిల్ల: ఇబ్బందులు లేకుండా చూడాలి: మంత్రి

image

యాసంగి పంట కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్‌ ఝాతో హైదరాబాదు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే పంట కొనుగోలు సజావుగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలన్నారు.

News April 19, 2025

అజహరుద్దీన్‌కు షాక్!

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఉప్పల్‌ స్టేడియంలో నార్త్‌ స్టాండ్‌కు ఆయన పేరును తొలగించాలని అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య HCAను ఆదేశించారు. లార్డ్స్‌ క్రికెట్‌ క్లబ్‌ వేసిన పిటిషన్‌పై అంబుడ్స్‌మన్‌ విచారణ చేపట్టారు. HCA అధ్యక్షుడిగా ఉన్న సమయంలో స్టాండ్స్‌కు తన పేరు పెట్టాలని అజర్‌ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చెల్లదని తీర్పునిచ్చారు.

error: Content is protected !!