News October 9, 2025
సిద్దిపేట: కొండెక్కిన కొబ్బరికాయ ధర!

కొబ్బరికాయల ధర కొండెక్కి కూర్చొంది. చిన్న కాయ అయినప్పటికీ ఎన్నడూ లేని విధంగా ధర పలుకుతోంది. దీంతో కొబ్బరి కాయలను కొనాలంటేనే వినియోగదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిద్దిపేట మార్కెట్లో చిన్న సైజ్ కొబ్బరికాయ ధర రూ.35 కాగా.. ఒక మోస్తరు సైజ్ కొబ్బరి ధర రూ.45 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. ధర మునుపెన్నడు లేని విధంగా అమాంతంగా పెరగడంతో వినియోగదారులు అవసరమైతే తప్ప కొనడం లేదు.
Similar News
News October 9, 2025
తెనాలి: ‘మావు’లకు కేరాఫ్ అడ్రస్ ఆ ఊరు.!

కాలువల్లో చేపల వేటకు ఉపయోగించే వెదురు ‘చేపల మావుల’ తయారీలో తెనాలి సమీప ఆలపాడు ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపలు పట్టుకొని వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరికి చేపల మావులు అనగానే ముందుగా గుర్తొచ్చేది చుండూరు మండలం ఆలపాడు గ్రామమే. నాణ్యమైన మన్నికైన చేపల మావులు కోసం అనేక మంది ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసుకు వెళుతుంటారు. ఇక్కడ చాలా కుటుంబాలు వ్యవసాయ పనులతో పాటు వీటి తయారీ వృత్తిపైనే ఆధారపడ్డాయి.
News October 9, 2025
షూ దాడి ఘటనపై స్పందించిన CJI

సుప్రీంకోర్టులో లాయర్ షూతో దాడి చేసేందుకు యత్నించిన ఘటనపై CJI బీఆర్ గవాయ్ స్పందించారు. ఓ కేసు విచారణ సందర్భంగా దీని ప్రస్తావన రాగా ఆ ఘటన సమయంలో తాను, సహచర జడ్జి షాక్‌కు గురయ్యామని ఆయన తెలిపారు. తమ వరకు అదొక మర్చిపోయిన అధ్యాయమని చెప్పారు. అయితే CJIపై దాడిని జోక్‌గా తీసుకోవద్దని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. షూ దాడి ఘటన సుప్రీంకోర్టును అవమానించడమేనని వ్యాఖ్యానించారు.
News October 9, 2025
యాదాద్రి: మొదటి విడత ఎన్నికలు ఇక్కడే..

భువనగిరి జిల్లాలో మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఆలేరు, రాజపేట, మోటకొండూరు, యాదగిరిగుట్ట, తుర్క పల్లి(ఎం), బొమ్మలరామారం, గుండాల, ఆత్మకురు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. నేటి నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ ఈ ప్రక్రియ ఎంపీడీవో కార్యాలయాలలో కొనసాగుతుందన్నారు.