News January 26, 2025

సిద్దిపేట: ఖైదీలు తమ హక్కులను తెలుసుకోవాలి: జడ్జి

image

ఖైదీలు తమ హక్కులను తెలుసుకోవాలని సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమాదేవి తెలిపారు. జిల్లా లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా జైలులో ఏర్పాటు చేసిన లీగల్ అవెర్నెస్ కార్యక్రమానికి జడ్జి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఆర్థిక స్థితి లేని ఖైదీలు ఉచితంగా ప్రభుత్వ పరంగా లాయర్‌లను పెట్టుకోవచ్చని సూచించారు.

Similar News

News November 15, 2025

WNP: ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

వెనుకబడిన తరగతుల కుటుంబాల పిల్లల విద్యాభివృద్ధికి బీసీ సంక్షేమశాఖ అండగా నిలుస్తోందని వనపర్తిజిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ముజాహిద్ ఖాన్ తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరానికి గాను 9,10వ తరగతుల బీసీ,ఈబీసీ విద్యార్థుల కోసం ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ పథకంకింద ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అర్హులైన విద్యార్థులుతప్పనిసరిగా https://teలan-ganaepass.cgg.gov.in లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.

News November 15, 2025

దర్యాప్తు, పరిశోధన నాణ్యత ప్రమాణాలతో నిర్వహించాలి: ADB ఎస్పీ

image

హత్య, ఆత్మహత్య, రోడ్డు ప్రమాదాలు, అనుమానాస్పద మరణం, నీటిలో మునిగి చనిపోయిన, ఇతర నేరాల దర్యాప్తుకు సంబంధించి పోలీస్ సిబ్బందికి 5 రోజుల పాటు శిక్షణ అందించారు. ఈ శిక్షణలో 21 మంది పాల్గొన్నారు. కోర్టులో నేరస్థులకు శిక్షలు పడినప్పుడు ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం పెరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. నేర స్థలాన్ని ఏర్పాటు చేసి శిక్షణను అందించారు. ఎఫ్ఐఆర్, కస్టడీ, అరెస్టు, రిమాండ్ అంశాలపై శిక్షణ అందించారు.

News November 15, 2025

త్వరలో GHMC ఉద్యోగుల బోగస్ హాజరుకు చెక్!

image

జీహెచ్ఎంసీ పరిధిలో ఉద్యోగుల బోగస్ హాజరు అరికట్టడం కోసం త్వరలోనే ఆటోమేటిక్ కాంటాక్ట్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు బల్దియా కసరత్తు చేస్తోంది. కార్యాలయాల్లోనూ అమలు చేసేందుకు ఇప్పటికే నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. తద్వారా రికార్డుల్లో లేకుండా వేతనాలు కాజేస్తున్న వారిని గుర్తించడం, జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి కొడుతున్న వారి భరతం పట్టనున్నారు.