News August 9, 2025
సిద్దిపేట: గంజాయి అమ్మడానికి ప్రయత్నం.. ఇద్దరి అరెస్ట్

గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సిద్దిపేట 3వ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ తెలిపారు. మిట్టపల్లికి చెందిన సిద్దరబోయిన అఖిల్ (21) పవన్ కుమార్ (20) శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నాంచార్ పల్లి, బక్రీ చేప్యాల శివారులో గంజాయి అమ్మడానికి ప్రయత్నించారు. నమ్మదగిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, 3వ టౌన్ SI చంద్రయ్య వెళ్లి పట్టుకున్నారు.
Similar News
News August 9, 2025
అన్నదాత సుఖీభవ.. త్వరలో వారి ఖాతాల్లోకి డబ్బులు

AP: వివిధ కారణాలతో ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద సాయం అందని రైతుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వ్యవసాయ శాఖ చేపట్టిన గ్రీవెన్స్‌కు ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు 10,915 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 1,290 మంది రైతులు అప్లై చేసుకున్నారు. గ్రీవెన్స్‌లో సమస్య పరిష్కారమై, పథకానికి అర్హులైన వారికి త్వరలో నగదు జమ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.
News August 9, 2025
పెరుగుతున్న ఎండు మిర్చి ధర

TG: ఖమ్మం, వరంగల్ మార్కెట్ యార్డుల్లో ఎండు మిర్చి ధరలు పెరుగుతున్నాయి. గత నెలతో పోలిస్తే అన్ని రకాల మిర్చి క్వింటాల్‌కు రూ.500 పెరిగింది. ఖమ్మం మార్కెట్‌లో నాణ్యమైన తేజా రకం క్వింటాల్‌కు రూ.14,500 వరకు పలుకుతోంది. సగటు ధరలు రూ.13,500 నుంచి రూ.14వేల మధ్యలో ఉన్నాయి. విదేశాలకు ఎగుమతులు పెరగడం, మిర్చి లభ్యత తగ్గడంతో రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
News August 9, 2025
PDPL: అగ్నిపథ్, SSC GD అభ్యర్థులకు ఉచిత శిక్షణ

అగ్నిపథ్, SSC GD పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన PDPL జిల్లా అభ్యర్థులకు ఉచిత గ్రౌండ్ శిక్షణను ఆగస్టు 10 నుంచి అందించనున్నట్టు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 45 రోజులపాటు జరిగే ఈ శిక్షణలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తారు. అగ్నిపథ్‌కు 1600 మీటర్లు, GD అభ్యర్థులకు 5 KM పరుగు శిక్షణ ఉంటుందని, ఆసక్తిగల అభ్యర్థులు 9949725997, 8333044460 నంబర్లను సంప్రదించవచ్చని కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.