News February 6, 2025
సిద్దిపేట: గురుకుల ప్రవేశాలకు నేడే లాస్ట్

రాష్ట్రంలోని గురుకులాల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా అధికారులు సూచించారు. 2025–26లో ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో ఖాళీలు, 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 23న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
Similar News
News December 26, 2025
వరంగల్: తాగి పట్టుబడ్డ 62మందిపై కేసు

మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై వరంగల్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కమిషనరేట్ పరిధిలో గురువారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో 62 మంది పట్టుబడ్డారు. ట్రాఫిక్ విభాగం పరిధిలో-16, ఈస్ట్ జోన్‌లో 13, వెస్ట్ జోన్ 13, సెంట్రల్ జోన్లలో 20 కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 26, 2025
BREAKING: తిరుపతి చేరుకున్న CM

జిల్లా పర్యటన నేపథ్యంలో CM చంద్రబాబు శుక్రవారం తిరుపతికి చేరుకున్నారు. హెలీకాప్టర్‌లో SV అగ్రికల్చర్ యునివర్సిటీకి వచ్చిన ఆయనకు కలెక్టర్ వెంకటేశ్వర్, SP సుబ్బారాయుడు స్వాగతం పలికారు. అనంతరం CM భారతీయ విజ్ఞాన సమ్మేళనం సదస్సుకు హాజరుకానున్నారు.
News December 26, 2025
తూటాకు తూటాతోనే సమాధానం చెప్పిన సర్దార్ ఉద్దమ్ సింగ్

భారత స్వాతంత్య్ర పోరాటంలో సర్దార్ ఉద్దమ్ సింగ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. జలియన్‌వాలా బాగ్ మారణకాండను ప్రత్యక్షంగా చూసి.. దానికి బాధ్యుడైన జనరల్ డయ్యర్‌ను లండన్ వెళ్లి హతమార్చారు. ‘రామ్ మొహమ్మద్ సింగ్ ఆజాద్’ (మూడు మతాలు కలిసేలా) అనే పేరుతో కోర్టులో నిలబడి “దేశం కోసం యువకుడిగానే మరణిస్తా” అని ధైర్యంగా ప్రకటించారు. తూటాకు తూటాతోనే సమాధానం చెప్పిన ఉద్దమ్ సింగ్ ఎందరికో స్ఫూర్తి. నేడు ఆయన జయంతి.


