News March 20, 2025
సిద్దిపేట: గేట్ ఫలితాల్లో మెరిసిన యువకుడు

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE-2025) ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన సింగిరెడ్డి శ్రావణ్ రెడ్డి ఆల్ ఇండియాలో 807వ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా శ్రావణ్ రెడ్డిని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు. కాగా శ్రావణ్ రెడ్డి చిన్ననాటి నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.
Similar News
News March 20, 2025
BREAKING: మరో భారీ ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన కాల్పుల్లో పలువురు మావోలు మరణించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఏడాది ఇప్పటికే పలుమార్లు జరిగిన ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు.
News March 20, 2025
అలా చేయడం రేప్ కాదు: అలహాబాద్ హైకోర్టు

వక్షోజాలను తాకడం, పైజామాను తీసివేయాలని ప్రయత్నించడం రేప్ కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 11 ఏళ్ల చిన్నారితో ఇద్దరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఇలా పేర్కొంది. అయితే ఈ కేసులో బాధితురాలిని దుస్తులు లేకుండా చేయలేదని సాక్షులు పేర్కొన్నట్లు తెలిపింది. అంతేకాకుండా లైంగిక దాడికి యత్నించారనే ఆరోపణలు కూడా లేవంది. కింది కోర్టు రేప్ కేసుగా పేర్కొనగా HC దానిని సవరించింది.
News March 20, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నెల తర్వాత 23K చేరిన నిఫ్టీ

అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నెల తర్వాత నిఫ్టీ 23వేల మార్కును అందుకుంది. అటు సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడి 75,889 వద్ద చలిస్తోంది. ఐటీ, బ్యాంకింగ్ రంగాలు లాభాల బాట పట్టాయి.