News February 23, 2025
సిద్దిపేట: గ్రామం నుంచి జాతీయ స్థాయికి

బహుజన సమాజ్ పార్టీలో గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి కోఆర్డినేటర్‌గా ఎన్నికైన బెజ్జంకి మండల వాసి నిషాని రామ చంద్రంను శనివారం బెజ్జంకిలో మానకొండూర్ నియోజకవర్గ నాయకులు పలువురు ఘనంగా సన్మానించారు. బాధ్యతలను అప్పగించిన బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి ధన్యవాదాలు తెలిపారు. మాతంగి తిరుపతి, మల్లయ్య, నిషాని రాజమల్లు, సుమలత, గుర్రం సత్యనారాయణ, రాజు, కనకం రఘు పాల్గొన్నారు.
Similar News
News February 23, 2025
సిరిసిల్లలో రేపు ప్రజావాణి రద్దు

సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నాడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు వినతులు ఇవ్వడానికి సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మహా శివరాత్రి జాతర సందర్భంగా అధికారులంతా బిజీగా ఉండటంతో ప్రజావాణి రద్దు చేశామన్నారు.
News February 23, 2025
సిద్దిపేట: బర్డ్ ఫ్లూ దెబ్బకు ప్రజల్లో ఆందోళన

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోవడంతో, చికెన్ ధరలు తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.180 ఉండగా ప్రస్తుతం రూ.130గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.
News February 23, 2025
సూర్యాపేట: నకిలీ పోలీస్ మోసం

SRPT జిల్లాలో నకిలీ డీఎస్పీ ఉదంతం బయటకు వచ్చింది. మఠంపల్లి చెందిన యువకుడు కారు డ్రైవర్. తను డీఎస్పీనని APకి చెందిన మహిళను నమ్మించినట్లు సమాచారం. SI జాబ్ ఇప్పిస్తానని రూ.32 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. చాలా రోజులు ఎదురు చూసిన ఆమె మోసపోయినట్లు గ్రహించి మఠంపల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.