News March 15, 2025

సిద్దిపేట: గ్రూప్-3లో సత్తా చాటిన యువకుడు

image

తొగుట గ్రామానికి చెందిన ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్ గ్రూప్-3 ఫలితాలలో సత్తా చాటాడు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 232 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం గ్రూప్-4 ఆఫీసర్‌గా HMDAలో విధులు నిర్వహిస్తున్నాడు. తన ప్రిపరేషన్ కొనసాగిస్తూ గ్రూప్-1 సాధించి డీఎస్పీ అవ్వడమే తన లక్ష్యమని ముచ్చర్ల శ్రీకాంత్ తెలిపాడు.

Similar News

News February 16, 2026

మెరుగైన వసతులు కల్పించాలి: కలెక్టర్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురంలో టాస్క్ ఫోర్స్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రతి శనివారం ఒక వసతి గృహాన్ని, ఒక గురుకుల పాఠశాలను క్షేత్రస్థాయిలో సందర్శించి నివేదిక ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.

News February 16, 2026

భైంసాలో బద్దలైన మజ్లిస్ కోట

image

TG: నిర్మల్ (D) భైంసా మున్సిపల్ ఛైర్మన్ పీఠం గత 20 ఏళ్లుగా MIM చేతుల్లోనే ఉండేది. తాజా ఎన్నికల్లో 26 వార్డులకు గాను MIM 12, BJP 6, కాంగ్రెస్ 1, స్వతంత్రులు 7 చోట్ల గెలిచారు. మరోసారి MIM ఛైర్మన్ పీఠం దక్కించుకుంటుందని అంతా భావించారు. అయితే స్వతంత్రులకు బీజేపీ మద్దతు తెలిపింది. దీంతో ఇండిపెండెంట్లు దత్తాత్రి (బీజేపీ రెబల్), ఖతీజా బేగం (MIM రెబల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అయ్యారు.

News February 16, 2026

అనకాపల్లి: బిల్ గేట్స్ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

image

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతిలో బిల్ గేట్స్‌తో జరిగిన సమావేశంలో అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ వర్చువల్‌గా పాల్గొన్నారు. జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను వారు వివరించారు. ఆర్టీజీఎస్ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను తెలియజేశారు.