News March 13, 2025
సిద్దిపేట: ఘోర రోడ్డ ప్రమాదం వ్యక్తి మృతి

సిద్దిపేట జిల్లా నర్సంపేట కెనాల్ వద్ద జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. నర్సంపేట గ్రామానికి చెందిన వనం రాజు బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 16, 2025
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
*మూడు రాజధానుల పేరుతో గత పాలకుల మహాకుట్ర: CBN
*మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం సక్సెస్: జగన్
*TG: యూరియా బుకింగ్ కోసం యాప్: మంత్రి తుమ్మల
*HYD రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ
*భారీగా పెరిగిన బంగారం ధరలు
*ఇండియాలో ముగిసిన GOAT మెస్సీ పర్యటన
News December 16, 2025
నూతన కానిస్టేబుళ్లతో రేపు సీఎం సమావేశం

AP: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో సీఎం చంద్రబాబు రేపు సమావేశం కానున్నారు. మంగళగిరి APSP 6వ బెటాలియన్ ప్రాంగణంలో 5PMకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 22 నుంచి వారికి ట్రైనింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. కాగా 6,100 మందిని రిక్రూట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 6,014 మంది సెలెక్ట్ అయ్యారు. వీరిలో 5,757 మంది ట్రైనింగ్‌కు ఎంపిక అయ్యారు.
News December 16, 2025
అభివృద్ధి, ఆదాయం పెంపు దిశగా అడుగులు

TG: అభివృద్ధి, ఆదాయం పెంపు దిశగా అడుగులేసేందుకు ప్రతి 3నెలలకు GSDPని సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఏడాది చివర్లో కానీ చేయడం లేదు. దీనివల్ల ఆదాయ వృద్ధి, లీకేజీల నివారణకు ఆస్కారం లేకపోతోంది. అటు కేంద్రం, AP త్రైమాసిక రివ్యూలతో ముందుకు వెళ్తున్నాయి. అదే మాదిరి ఇక్కడా అగ్రి, సర్వీస్, ప్రొడక్టివిటీ రంగాలపై సర్కారు దృష్టి పెట్టనుంది. తద్వారా మరింత వృద్ధి సాధ్యమని భావిస్తోంది.


