News December 22, 2025
సిద్దిపేట: చలి బాబోయ్ చలి.. మంట కాచుకున్న కుక్కలు

చలి బాబోయ్ చలి అంటూ కుక్కలు చలి మంట కాచుకున్నాయి. సిద్దిపేట జిల్లాలో మూడు రోజుల నుంచి చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. సిద్దిపేట జిల్లా ఎన్సాన్పల్లిలో చలి నుంచి ఉప శమనం కోసం కొంతమంది యువకులు చలిమంటలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే చలికి వణుకుతున్న కుక్కలు మంటల దగ్గరకు వచ్చి కాచుకున్నాయి. దీంతో మూగజీవాలు చలికి ఇబ్బందులు పడుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News December 23, 2025
OFFICIAL: వారణాసిలో నటిస్తున్న ప్రకాశ్ రాజ్

మహేశ్-రాజమౌళి కాంబోలో వస్తున్న ‘వారణాసి’ చిత్రంలో విలక్షణ నటుడు <<18570987>>ప్రకాశ్ రాజ్<<>> నటిస్తున్నారంటూ గాసిప్స్ వైరలైన విషయం తెలిసిందే. తాను వారణాసి చిత్రంలో నటిస్తున్నట్లు ఇప్పుడు స్వయంగా ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. ‘వారణాసి షూటింగ్‌లో అద్భుతమైన షెడ్యూల్ ముగిసింది. రాజమౌళి, మహేశ్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రాకు థాంక్స్. తర్వాతి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
News December 23, 2025
KNR: ‘ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి’

KNR జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య శాఖల అధికారులతో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. తరచుగా ప్రమాదాలు జరిగే ‘బ్లాక్ స్పాట్’లను గుర్తించి, అక్కడ ప్రాణ నష్టం జరగకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
News December 23, 2025
‘పల్లె వెలుగు’ బస్సులూ EV ACవే ఉండాలి: CBN

AP: RTCలో ప్రవేశపెట్టే బస్సులు, ‘పల్లెవెలుగు’ అయినా సరే ఎలక్ట్రికల్ ఏసీవే ఉండాలని CM CBN అధికారులను ఆదేశించారు. ‘వచ్చే ఏడాది కొనే 1450 బస్సులూ ఈవీనే తీసుకోవాలి. 8819 డీజిల్ బస్సుల స్థానంలో EVలనే పెట్టండి. 8 ఏళ్ల కాలపరిమితి దాటిన వాటినీ మార్చాలి. తిరుమల- తిరుపతి మధ్య రవాణాకు 300 ఈ-బస్సులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది’ అని వివరించారు. బస్సుల మెయింటెనెన్సును ప్రైవేటుకు అప్పగించాలని సూచించారు.


