News September 14, 2024

సిద్దిపేట: చిన్నారి గుండెలకు భరోసా

image

సిద్దిపేట జిల్లా కొండపాక శివారులోని ఆనంద నిలయం వృద్ధాశ్రమం వద్ద పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను కాపాడేందుకు ‘సత్యసాయి హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌’ సంజీవిని దవాఖానతో చిన్నారుల గుండెకు భరోసా అందించేందుకు ముందుకు వచ్చింది. 5ఎకరాల విస్తీర్ణంలో రూ.40 కోట్లతో దవాఖాన నిర్మించారు. నేడు ఈ దవాఖానాను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించనున్నారు.

Similar News

News December 23, 2025

MDK: నేడు లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా

image

జిల్లాలో ఆహార వ్యాపార నిర్వాహకుల(ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) కోసం నేడు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(FSSAI ) లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా ఆహార తనిఖీ అధికారి స్వదీప్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో S-29లో ఉదయం 11.00 గంటల నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించబడుతుందని తెలిపారు. వివరాలకు 9441956370 సంప్రదించాలన్నారు.

News December 22, 2025

మెదక్: భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్

image

భూ భారతి దరఖాస్తులను శాశ్వతంగా పరిష్కరించాలని, అధికారులు సమయ పాలనా పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులు తప్పని సరిగా సమయ పాలనా పాటించాలన్నారు. కార్యాలయాలలో తప్పకుండా హాజరును నమోదు చేయాలన్నారు.

News December 22, 2025

మెదక్: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.