News March 27, 2025
సిద్దిపేట: చూపు తిప్పుకోలేకపోతున్నారు..

సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో ఒక రైతు వెరైటీ ఆలోచన చేశాడు. తన భూమిలో వేసిన మిరప పంటకు దిష్టి తగలకుండా అందాల సినిమా తార శ్రీలీలా ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. దీంతో అటు వైపుగా వెళుతున్న వాహనదారులు, బాటసారులు మిరప పంటపై కాకుండా అందాల తార పై దృష్టి పెడుతున్నారు. గ్రామానికి చెందిన రైతు ఉప్పలయ్య పొలంలోనిది ఈ దృశ్యం.
Similar News
News November 12, 2025
పెద్దపల్లి: ‘బీసీ విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేయాలి’

2024-25, 2025-26 విద్యా సంవత్సరాలకు ప్రీ మెట్రిక్ ఉపకారవేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు PDPL జిల్లా బీసీ సంక్షేమ అధికారి రంగారెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9వ, 10వ తరగతి BC విద్యార్థులు తమ అర్హతల ప్రకారం www.telanganaepass.cgg.gov.in ద్వారా ఫ్రెష్ లేదా రెన్యువల్ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ప్రక్రియలో విద్యార్థులకు సహకరించాల్సిందిగా ప్రధానోపాధ్యాయులను కోరారు.
News November 12, 2025
పెద్దపల్లి: ‘17% లోపు తేమతోనే ధాన్యం తీసుకురావాలి’

రైతులు వరి ధాన్యాన్ని 17%లోపు తేమ వచ్చాక మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని బుధవారం పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటనలో తెలిపారు. పొలంనుంచి నేరుగా కాకుండా ముందుగా బాగా ఆరబెట్టాలని, రాత్రిపూట ప్లాస్టిక్ కవర్లు కప్పి తేమ పెరగకుండా చూడాలని చెప్పారు. నాణ్యమైన ధాన్యం తీసుకువస్తే అదే రోజు కాంటా వేసి మిల్లులకు తరలిస్తామని తెలిపారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా సూచనలు పాటించాలని కోరారు.
News November 12, 2025
హైదరాబాద్‌లో జగిత్యాల వాసి అనుమానాస్పద మృతి

వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన ఘటన HYDలోని మియాపూర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాలకు చెందిన సతీశ్ మియాపూర్‌లోని హాస్టల్‌లో ఉంటూ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి సతీశ్ హాస్టల్‌లోని తన రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉండటంతో హాస్టల్ యజమాని చూడగా అప్పటికే మృతిచెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి కేసు నమోదు చేశారు.


