News March 12, 2025

సిద్దిపేట: జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై త్వరలో సమావేశం

image

రాష్ట్రంలో జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పథకాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు గాను త్వరలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి.దామోదర్ రాజ నరసింహా హామీ ఇచ్చారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు ఖాజా విరాహత్ అలీ ఆధ్వర్యంలో నాయకులు మంత్రి దామోదరకు వినతిపత్రాన్ని అందజేశారు.

Similar News

News March 9, 2026

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజావాణి

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులను స్వీకరించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ రవీందర్, ఏసీపీలు, డీఈలు, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

News March 9, 2026

చిరంజీవి రాంగ్ టైమ్‌లో పార్టీ పెట్టారు: శివాజీ

image

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై నటుడు శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘చిరంజీవి రాష్ట్రం విడిపోయిన తర్వాత పార్టీ పెట్టి ఉండాల్సింది. అలా అయితే సీమాంధ్రలో కచ్చితంగా అధికారంలోకి వచ్చి ఉండేవారు. రాంగ్ టైమ్‌లో పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల వరకైనా పార్టీని కొనసాగించి ఉంటే అధికారంలోకి వచ్చి ఉండేవారేమో’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

News March 9, 2026

ట్రోఫీతో గుడికి.. మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

image

1983 WC విజేత, TMC MP కీర్తి ఆజాద్ టీమ్ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. T20 WC ట్రోఫీతో <<19333290>>హిందూ ఆలయానికి<<>> వెళ్లడాన్ని తప్పుబట్టారు. టీమ్ఇండియా 140 కోట్ల భారతీయులు, అన్ని మతాలను రిప్రజెంట్ చేస్తుందని.. కేవలం ఒక మతానిదో లేదా జై షా కుటుంబానిదో కాదని విమర్శించారు. సిరాజ్ మసీదుకు లేదా శాంసన్ చర్చికి ట్రోఫీని తీసుకెళ్లలేదన్నారు. ఒకే మతం చుట్టూ విజయాన్ని తిప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు.