News February 9, 2025
సిద్దిపేట: జాతీయ స్థాయి పోటీలకు జిల్లా విద్యార్థినులు
గత నెలలో తూప్రాన్‌లో నిర్వహించిన SGF అండర్ 14 సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నంగునూరు మండలం గట్ల, మల్యాల విద్యార్థినిలు ఈశ్వరి, అను జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులను హెచ్ఎం రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు రాజకుమార్ అభినందించారు. వారు మాట్లాడుతూ 13 నుంచి 16 వరకు మహారాష్ట్రలో జరిగే పోటీల్లో ఈశ్వరి, అను పాల్గొంటారని తెలిపారు.
Similar News
News February 9, 2025
రోహిత్ ఫామ్‌పై ఆందోళన లేదు: బ్యాటింగ్ కోచ్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ గురించి తమకు ఆందోళన లేదని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. ‘రోహిత్‌కు వన్డేల్లో 31 సెంచరీలున్నాయి. గత వన్డే సిరీస్‌లో(vsSL) 56, 64, 35 పరుగులు చేశాడు. టెస్టుల్లో విఫలమయ్యాడు కానీ వన్డేల్లో రన్స్ చేస్తూనే ఉన్నాడు. అతడి బ్యాటింగ్‌తో మాకు ఏ సమస్యా లేదు’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు.
News February 9, 2025
భద్రాద్రిలో 22 జడ్పీటీసీ, 236 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 జడ్పీటీసీ, 236 ఎంపీటీసీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. 21 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, ఇటీవల భద్రాచలం కొత్తగా ఏర్పడడంతో సంఖ్య 22కు చేరింది. గతంతో పోలిస్తే ఈసారి 16 ఎంపీటీసీ స్థానాలు పెరిగి 236 అయ్యాయి.
News February 9, 2025
మహారాష్ట్రలో పెరుగుతున్న GBS కేసులు
మహారాష్ట్రలో తాజాగా మరో 3 <<15225307>>గిలియన్ బార్ సిండ్రోమ్<<>> కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 183కు చేరింది. 6 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 151 మంది కోలుకున్నారు. ఇటీవల ముంబైలోనూ GBS తొలి కేసు నమోదైంది. 64 ఏళ్ల వృద్ధురాలికి ఈ వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అంధేరి తూర్పు ప్రాంతంలో నివసించే ఆ మహిళకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.