News September 21, 2025
సిద్దిపేట జిల్లాలో డెంగ్యూ కేసులు కలకలం

సిద్దిపేట జిల్లాలో డెంగ్యూ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల డెంగ్యూ జ్వరంతో జగదేవ్పూర్ మండానికి చెందిన ఇంటర్ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. దుబ్బాక నియోజకవర్గంలో కూడా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గజ్వేల్ మండలానికి చెందిన బాలుడు నిన్న నీలోఫర్ హాస్పిటల్‌లో డెంగ్యూ చికిత్స పొందుతూ మృతి చెందారు. అధికారులు స్పందించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Similar News
News September 21, 2025
VKB: ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. అదుపులోకి పర్యాటకులు: సీఐ

వికారాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన నలుగురు పర్యాటకులని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతగిరి కొండ వద్ద ఈ ఘటన జరగ్గా, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వికారాబాద్ పట్టణ సీఐ భీమ్‌కుమార్ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించామని, విచారణ కొనసాగుతోందని ఆయన చెప్పారు.
News September 21, 2025
విశాఖలో ఈ-గవర్నెన్స్ సదస్సుకు సీఎం

సీఎం చంద్రబాబు సోమవారం విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు విశాఖ చేరుకుంటారు. 9:45కు 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో పాల్గొంటారు. సదస్సుకు ముందు ఈ గవర్నమెంట్ ఎగ్జిబిషన్‌ని ప్రారంభిస్తారు. అనంతరం 12 గంటలకు విజయవాడ తిరిగి వెళ్తారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ గవర్నెన్స్ సదస్సులో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.
News September 21, 2025
NGKL: హెచ్1బి ఫీజులు భారత యువతకు దెబ్బ

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన హెచ్1బి అసాధారణ ఫీజులను నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థకు, నిరుద్యోగ యువతకు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు చావుదెబ్బగా మారుతుందని అన్నారు. భారత ప్రభుత్వం తక్షణమే స్పందించి అమెరికాకు గట్టి సమాధానం ఇవ్వాలని, అవసరమైతే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.