News August 31, 2025
సిద్దిపేట జిల్లాలో ‘డెంగ్యూ’ భయం

సిద్దిపేట జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డెంగ్యూ జ్వరంతో జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్, అనంతసాగర్ గ్రామాలకు చెందిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడంతో ప్రజల్లో మరింత ఆందోళన మొదలైంది. ఇదే నెలలో దుబ్బాకలోనూ డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దోమకాటు ద్వారా డెంగ్యూ వ్యాపి చెందుతుండగా అధికారులు స్పందించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News August 31, 2025
పదేళ్లలో 1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ: CM

KC వేణుగోపాల్ ప్రారంభించిన MP మెరిట్ అవార్డులకు దేశంలో ఎంతో ప్రత్యేకత ఉందని CM రేవంత్ పేర్కొన్నారు. కేరళలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ‘కేరళలో అమలు చేస్తున్న వయోజన విద్యా కార్యక్రమం అన్ని రాష్ట్రాలకు ఆదర్శం. TGలో విద్యాభివృద్ధిపై దృష్టి సారించాం. వచ్చే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం’ అని తెలిపారు.
News August 31, 2025
వినాయక నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు- SP

వినాయక నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నామని మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 వరకు గణపతి విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారని, ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని పోలీసు అధికారి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్ఓలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
News August 31, 2025
వరంగల్‌లో ప్రశాంతంగా వినాయక ఉత్సవాలు: సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణపతి నవరాత్రులు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని సీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 6,683 విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. సెంట్రల్ జోన్ పరిధిలో 2,675, ఈస్ట్ జోన్‌లో 2,043, వెస్ట్ జోన్‌లో 1,945 విగ్రహాలు నెలకొల్పబడ్డాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని సీపీ పేర్కొన్నారు.