News February 1, 2025
సిద్దిపేట జిల్లాలో డ్రగ్స్ అంతం చేయాలి: అబ్దుల్ హమీద్
సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్లో రోడ్డు భద్రత కమిటీ, మత్తు పదార్థాల వినియోగ నివారణకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) అబ్దుల్ హమీద్ నిర్వహించారు. జిల్లాలో డ్రగ్స్ సరఫరా, వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంతం చెయ్యాలన్నారు. ముఖ్యంగా ఎక్కడి నుంచి రవాణా అవుతుందో నిఘా పెట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు.
Similar News
News February 1, 2025
విశాఖ -పలాస పాసింజర్ రైళ్ల గమ్యం కుదింపు
వాల్తేర్ డివిజన్‌లో సాంకేతిక కారణాల వల్ల విశాఖ -పలాస పాసింజర్ రైళ్ల గమ్యం కుదింపు చేసినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ-పలాస (67289/90)రైళ్లు ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు శ్రీకాకుళం వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో పలాసకు బదులుగా శ్రీకాకుళం నుంచి బయలుదేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 1, 2025
4 స్కీమ్స్.. ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి డబ్బులు
TG: గత నెల 26న ప్రారంభించిన 4 పథకాలను గ్రామాల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈనెల 3 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఇప్పటికే 563 గ్రామాల్లో ఈ స్కీమ్స్‌ను ప్రారంభించింది. మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు 40 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి 31లోగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
News February 1, 2025
ఏలూరు: ఇంటర్ క్వాలిఫయింగ్ పరీక్షలు: ఆర్ఐవో
ఏలూరు జిల్లాలో ఫిబ్రవరి 1, 3న ఇంటర్ క్వాలిఫయింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని RIO చంద్రశేఖర్ బాబు శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఫిబ్రవరి 3న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయన్నారు. 18,453 విద్యార్థులకు వారు చదువుతున్న కాలేజీల్లోనే (137) పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే ఇంటర్ పాస్ సర్టిఫికెట్ ఇవ్వబడుతుందన్నారు.