News March 11, 2025
సిద్దిపేట జిల్లాలో తహశీల్దార్ల బదిలీ

సిద్దిపేట జిల్లాలో పలువురు తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ మిక్కిలినేని మనూచౌదరి ఉత్తర్వులు జారీచేశారు. రాయపోల్ తహశీల్దార్ జీ. దివ్యను కొమురవెల్లికి, సిద్దిపేట ఆర్డీవో కార్యాలయ డీఏఓ ఐ. శ్రీనివాస్‌ను రాయపోల్ తహసీల్దార్‌గా, జగదేవపూర్ తహశీల్దార్ ఎం. కృష్ణమోహన్‌ను సిద్దిపేట ఆర్డీవో కార్యాలయ డీఏఓగా బదిలీ చేశారు. జగదేవపూర్ డీటీ రఘువీర్ రెడ్డికి జగదేవపూర్ తహసీల్దార్‌గా పూర్తి బాధ్యతలు అప్పగించారు.
Similar News
News July 7, 2025
శాకాంబరీ ఉత్సవాల్లో భద్రకాళి అమ్మవారి దర్శనం

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో నిర్వహిస్తున్న శాకాంబరీ మహోత్సవాల్లో భాగంగా పన్నెండవ రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసం ద్వాదశి తిథి సోమవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతినిచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.
News July 7, 2025
NLG: తీవ్ర విషాదం.. తండ్రి, కుమారుడు మృతి

ఆగి ఉన్న కారును కంటైనర్ ఢీకొనడంతో కారులో ఉన్న తండ్రి, కుమారుడు మృతిచెందిన ఘటన తిప్పర్తి మండలం రాయినిగూడెం స్టేజీ వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. HYD నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఆపిన ఓ కారును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుంటూరుకు చెందిన తండ్రి, కుమారుడు నాగేశ్వరరావు(44), అభిషేక్ (21) మృతి చెందగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తిప్పర్తి ఎస్ఐ శంకర్ తెలిపారు.
News July 7, 2025
వై.రామవరం: ప్రభుత్వం ఆదుకోవాలి

కడుపులోని పెరుగుతున్న పెద్దకాయతో బాధపడుతూ ఓ వ్యక్తి మంచానికే పరిమితమయ్యాడు. వై.రామవరం (M) కే.ఎర్రగొండకు వెంకటేశ్ దీర్ఘకాలంగా ఈ వ్యాధితో బాధ పడుతున్నాడు. తల్లిదండ్రులు, తోడపుట్టిన వాళ్లు ఇటీవల మరణించారని, ఒంటరిగా ఉన్న తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.