News January 30, 2025

సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం.. ఇద్దరు మృతి

image

సిద్దిపేట జల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో ఉపాధి హామీ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుని ఇద్దరు మృతి చెందారు. బండరాళ్లు మీద పడి తల్లి సరోజన, కూమార్తె మమత అక్కడికక్కడే మరణించారు. బండరాళ్లు కిందపడిన ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 11, 2025

ఆత్రేయపురం: బస్సు కిందపడి చిన్నారి మృతి

image

ఆత్రేయపురం మండలం వేలేరు గ్రామంలో విషాద ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నాగిరెడ్డి సురేఖ తన కుమారుడు పవన్‌ను స్కూల్ బస్ ఎక్కించడానికి తీసుకెళ్లారు. ఈక్రమంలో ఆమె కుమార్తె హరిణి వరలక్ష్మి(7) సైతం వాళ్లతో వచ్చింది. అన్నయ్య స్కూల్ బస్సు ఎక్కుతుండగా చిన్నారి అటు వైపు పరిగెత్తింది. ఈక్రమంలో పాప వెనుక చక్రాల కిందపడి చనిపోయింది.

News November 11, 2025

పటాన్ చెరు: లాడ్జిలో యువకుడి ఆత్మహత్య

image

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో విషాదం చోటుచేసుకుంది. OYO లాడ్జిలో అఖిల్‌ (30) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్‌లో రూ.6 లక్షలు నష్టపోవడమే ఈ ఘటనకు కారణమని సమాచారం. అయితే అఖిల్ చనిపోయే ముందు తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడని, తండ్రి అక్కడకు చేరుకునే లోపే ఉరివేసుకున్నాడని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

News November 11, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నగదు జమ

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం తాజాగా రూ.202.93 కోట్లు విడుదల చేసింది. లబ్ధిదారులకు ప్రతి సోమవారం ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండగా ఈ వారం 18,247 మంది లబ్ధిదారులకు నగదు జమ అయినట్లు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతమ్ వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,33,069 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని, మొత్తం రూ.2,900 కోట్ల చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు.