News November 28, 2025
సిద్దిపేట: జిల్లాలో తొలి సర్పంచ్ ఏకగ్రీవం !

పంచాయతీ ఎన్నికల నామినేషన్ తొలిరోజే జగదేవ్‌పూర్ మండలం, బిజీ వెంకటాపూర్ సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. చెక్కల పరమేశ్వర్ పోటీ లేకుండానే సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధికి పరమేశ్వర్ నాయకత్వమే సరైనదని నమ్మిన గ్రామస్థులు, ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
Similar News
News December 4, 2025
అమరావతిలో భూసమీకరణపై ప్రశ్నలు!

AP: రాజధాని అమరావతిలో భూసమీకరణపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతలో సేకరించిన 32వేల ఎకరాల్లో పనులు ఓ కొలిక్కి రాకముందే రెండో విడతలో 16వేల ఎకరాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు మూడో విడత భూసేకరణ కోసం కసరత్తు చేస్తున్నామని మంత్రి నారాయణ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గన్నవరంలో విమానాశ్రయం ఉండగా అమరావతిలో మరో ఎయిర్‌పోర్ట్ ఎందుకని అంటున్నారు. దీనిపై మీ COMMENT?
News December 4, 2025
జీవీఎంసీలో విలీనం కానున్న గ్రామీణ మండలాలివే..!

ఉమ్మడి విశాఖ జిల్లా విభజన అనంతరం మిగిలిపోయిన 4 మండలాలైన ఆనందపురం, పద్మనాభం, భీమిలి, పెందుర్తిని GVMCలో విలీనం చేసే ప్రక్రియ జరుగుతోంది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని 3 గ్రామీణ మండలాలు (భీమిలి, పద్మనాభం, ఆనందపురం) GVMCలో కలిపేందుకు CM చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, నారాయణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తెలిపారు. దీంతో GVMC పరిధి విస్తరణతో పాటు వార్డులు కూడా పెరగనున్నాయి.
News December 4, 2025
ఏయే పూజలకు ఏ సమయం అనుకూలం?

పౌర్ణమి తిథి నేడు ఉదయం 8.37AMకి ప్రారంభమై, రేపు తెల్లవారుజామున 4.43AMకి ముగుస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజు చేసే ఏ పూజలైనా, వ్రతాలైనా ఈ సమయంలో చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. నేడు ఉదయం 6.59AM – 2.54PM మధ్యలో రవి యోగం ఉంటుందని, ఈ సమయంలో పవిత్ర స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని అంటున్నారు. లక్ష్మీ, సత్యనారాయణ వ్రతాలతో పాటు శివాభిషేకం, ఇతర పూజలు ప్రదోష కాలంలో చేయాలంటున్నారు.


