News December 11, 2025

సిద్దిపేట జిల్లాలో తొలి విజయం

image

సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మాందాపూర్ సర్పంచిగా లింగాల మౌనిక ముత్యం విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి నర్రా రవి మీద 321 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.

Similar News

News December 13, 2025

ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఒక్కరోజే 16 మంది మృతి

image

AP: రాష్ట్రంలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. నిన్న 4 రోడ్డు ప్రమాదాల్లో 16 మంది చనిపోయారు. అల్లూరి జిల్లాలో జరిగిన యాక్సిడెంట్‌లో 9 మంది మరణించారు. బాపట్ల(D) దోనేపూడిలో వాహనం వేగంగా దూసుకెళ్లి కాల్వలో కూరుకుపోవడంతో ముగ్గురు మృతి చెందారు. అదే జిల్లా చందోలులో రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు చనిపోయారు. నంద్యాల(D) ఆళ్లగడ్డలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు.

News December 13, 2025

కూష్మాండ దీపాన్ని ఎలా వెలిగించాలి?

image

ఓ చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకోవాలి. దాన్ని అడ్డంగా కోయాలి. లోపల ఉండే గింజలన్నీ తీసి డొల్లగా చేయాలి. పసుపు, కుంకుమ పెట్టి అందులో నల్ల నువ్వుల నూనె పోయాలి. 2 పెద్ద వత్తులతో దీపం వెలిగించాలి. అనంతరం పంచోపచార పూజ చేయాలి. కాల భైరవ అష్టకాన్ని 11 సార్లు చదవాలి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండటం ఉత్తమం. ఘన పదార్థాలను తినకూడదు. 4:30 AM – 6:00 AM మద్యలో ఈ పూజ చేస్తే ఉత్తమ ఫలితాలుంటాయి.

News December 13, 2025

పాలమూరు: 120 సీట్లుకు 7,115 మంది విద్యార్థుల పోటీ

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఈరోజు నవోదయ పరీక్ష రాయనున్నారు. 2026-27 సంవత్సరానికి మొత్తం 29 పరీక్ష కేంద్రాల్లో 7,115 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. శనివారం ఉదయం 11.30 నుంచి 1.30 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అరగంట ముందు నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. MBNRలో 40 వట్టెం జవహర్ నవోదయ 80 సీట్లు ఉన్నాయి.