News June 17, 2024

సిద్దిపేట జిల్లాలో దారుణం

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామలో దారుణ ఘటన వెలుగు చూసింది. కుటుంబ కలహాలతో తల్లి తన ఇద్దరు పిల్లలు  అనన్య(3), సహస్ర(1)ను నీటిలో ముంచి హత్య చేసేందుకు యత్నించింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాగా.. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 23, 2026

ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి : కలెక్టర్

image

ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 28 కేంద్రాల్లో 12,334 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాల స్పష్టం చేశారు.

News February 22, 2026

MRO, RDO కార్యాలయాల్లో రేపు ప్రజావాణి: మెదక్ కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా పడిన ‘ప్రజావాణి’ కార్యక్రమం సోమవారం నుంచి పునఃప్రారంభం కానుంది. జిల్లాలోని అన్ని MRO, RDO కార్యాలయాల్లో యథావిధిగా అర్జీలు స్వీకరిస్తారని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అయితే, కలెక్టరేట్‌లో మాత్రం ప్రస్తుతానికి హెల్ప్ డెస్క్ ద్వారానే దరఖాస్తులు తీసుకుంటామని, మార్చి 2 నుంచి అక్కడ పూర్తిస్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తామని స్పష్టం చేశారు.