News March 1, 2025
సిద్దిపేట జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

సిద్దిపేట జిల్లాలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు సిద్దిపేటలో 32 నుంచి 33 °C ఉష్ణోగ్రతలు ఉంటాయని, రేపు 33 నుంచి 34 °C ఉష్ణోగ్రతలతో మేఘావృతమై ఉండనున్నట్లు వాతావరణ సూచనలు చెబుతున్నాయి. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News February 28, 2026
సిద్దిపేట నుంచే కవిత కొత్త పార్టీ?

సిద్దిపేట కేంద్రంగా కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం సిద్దిపేటలో పార్టీ కార్యాలయం, నివాసం ఏర్పాటుకు స్థల పరిశీలన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
News February 28, 2026
ఏలూరు: జిల్లా అధికారులతో ఎస్పీ సమీక్ష

ఏలూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారంపై ఎస్పీ ప్రతాప్ కిషోర్ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తీవ్రమైన నేరాలు, మహిళలు, చిన్నారులపై జరిగిన దాడుల కేసుల్లో విచారణ ఏ దశలో ఉందో అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు పూర్తయిన కేసుల్లో వెంటనే ఛార్జ్ షీట్లను సిద్ధం చేసి, సంబంధిత న్యాయ స్థానాల్లో నిర్ణీత కాలవ్యవధిలో ఫైల్ చేయాలని స్పష్టం చేశారు.
News February 28, 2026
కామారెడ్డి జిల్లాలో 30, 30(ఏ) పోలీసు యాక్ట్ అమలు

కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా వచ్చే నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని ఎస్పీ రాజేశ్ చంద్ర శనివారం తెలిపారు. మార్చి 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు ఈ నిబంధనలు జిల్లా వ్యాప్తంగా వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించకూడదని వెల్లడించారు.


