News February 14, 2026

సిద్దిపేట జిల్లాలో హస్తం, కారు జోరు.. కమలం బేజారు !

image

సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్ మున్సిపల్ పోరు కాంగ్రెస్, BRS మధ్యే జరిగింది. గట్టి పోటీ ఇస్తుందని భావించిన బీజేపీ హుస్నాబాద్, చేర్యాలలో కనీసం ఖాతా తెరలేదు. దుబ్బాకలో 2 సీట్లు గజ్వేల్లో ఒక సీటుకే పరిమితమైంది. మొత్తం 4 మున్సిపాలిటీల్లో 3 BRS, ఒకటి కాంగ్రెస్ దక్కించుకుంది. మున్సిపల్ ఫలితాలపై BRS, కాంగ్రెస్ శ్రేణులు జోష్లో ఉండగా బీజేపీ శ్రేణులు నిరాశలో ఉన్నారు.

Similar News

News February 14, 2026

ఒడిశాలో సరికొత్త విప్లవం.. సూపర్ ఫుడ్స్‌ సాగుతో!

image

సంప్రదాయ పంటలకే కాకుండా భవిష్యత్తు సూపర్ ఫుడ్స్‌కు నిలయంగా ఒడిశా మారుతోంది. ఖుర్దా జిల్లా బెగునియా ప్రాంతంలో ఒక రైతు 40 లక్షల లీటర్ల సామర్థ్యం గల అతిపెద్ద ‘స్పిరులినా’ ఫామ్‌ను ఏర్పాటు చేశారు. నీలి ఆకుపచ్చ నాచు రకానికి చెందిన ఈ సూపర్ ఫుడ్‌లో ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఈ పోషకాహార సాగులో ఒడిశా ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది.

News February 14, 2026

కంకిపాడులో RTC బస్సు ఢీకొని మహిళ స్పాట్‌డెడ్

image

కంకిపాడు వద్ద జరిగిన ప్రమాదంలో స్థానికంగా ఉంటున్న శైలజా(45) మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కుందేరు నుంచి విజయవాడ వెళ్తున్న RTC బస్సు ప్రమాదవశాత్తు ఆమెను రంగా సర్కిల్ వద్ద ఢీ కొంది. ఈ ఘటనలో ఆమె తలపై నుంచి బస్సు వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె ఆలయానికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం ఉయ్యూరు తరలించారు.

News February 14, 2026

రేపు శివాలయానికి వెళ్తున్నారా? ఈ తప్పు చేయకండి!

image

శివాలయ దర్శనంలో ముఖ్యమైన నియమం శివ నిర్మాల్యాన్ని దాటకపోవడం. పుష్పదంతుడనే గంధర్వుడు నిర్మాల్యాన్ని దాటి తన శక్తిని కోల్పోయాడు. అందుకే శివాలయంలో చండీశ్వరుడి వరకు వెళ్లి వెనక్కి రావాలి. అర్ధ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. అలాగే దేవుడి వస్తువులను, భక్తులను కించపరచకూడదు. ఇది కూడా నిర్మాల్యాన్ని దాటడంతో సమానం. ఈ తప్పులు మనిషిలోని శక్తిని, తేజస్సును కోల్పోయేలా చేస్తాయని పండితులు చెబుతున్నారు.