News October 25, 2025
సిద్దిపేట జిల్లాలో 1715 చెరువులు ఎంపిక

చేప పిల్లల పంపిణీకి జిల్లా మత్స్యశాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. మత్స్యకారుల సొసైటీలకు గ్రామాలలోని చెరువుల్లో చేపలు ఉచితంగా పంపిణీ చేసి, విక్రయించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలో 379 సొసైటీలుండగా 24,601 మంది సభ్యులు ఉన్నారు. 3,256 చెరువులకు గానూ 1,715 చెరువుల్లో కట్ల, రవ్వ, బంగారుతీగ వంటి రకాలకు చెందిన 4.42 కోట్ల పిల్లలను పంపిణీ చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు.
Similar News
News October 25, 2025
కాసేపట్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి 10 గంటలలోపు వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, భద్రాద్రి, హైదరాబాద్, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, RR, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని IMD ఇప్పటికే హెచ్చరించింది.
News October 25, 2025
CSIR -NET దరఖాస్తు గడువు పొడిగింపు

రీసెర్చ్, లెక్చరర్‌షిప్ అవకాశం కల్పించే CSIR -NET దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. OCT 24తో అప్లై గడువు ముగియగా.. అభ్యర్థుల కోసం OCT 27 వరకు పొడిగించింది. ఫీజు చెల్లించడానికి OCT 25 ఆఖరు తేదీ కాగా.. OCT 28వరకు చెల్లించవచ్చు. దరఖాస్తులో తప్పుల సవరణకు OCT 29 నుంచి NOV 1 వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది. DEC 18న పరీక్ష నిర్వహించనున్నారు. వెబ్‌సైట్: nta.ac.in/
News October 25, 2025
మెదక్ ఎస్పీ కార్యాలయంలో 99 యూనిట్ల రక్త సేకరణ

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మెదక్ ఎస్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో 99 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అడిషనల్ ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలకు స్మారకంగా నిర్వహించిన ఈ శిబిరం సామాజిక సేవకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సేకరించిన రక్తంలో 80 యూనిట్లు నిలోఫర్ ఆసుపత్రికి, 19 యూనిట్లు మెదక్ బ్లడ్ బ్యాంకుకు తరలించారు.


