News December 11, 2025

సిద్దిపేట జిల్లాలో 9 గంటల వరకు ఇలా..!

image

సిద్దిపేట జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు మండలాల్లో ఉదయం 9 గంటల వరకు 24.38 శాతం నమోదైందని అధికారులు తెలిపారు. దౌల్తాబాద్ 22 శాతం, గజ్వేల్‌లో 21 శాతం, జగదేవపూర్ 21.27 శాతం, మర్కూక్ 29.30 శాతం, ములుగు 26.87 శాతం, రాయపోలు 26. 37 శాతం, వర్గల్ 26.37 శాతం పోలింగ్ నమోదైంది.

Similar News

News December 12, 2025

అనకాపల్లి జిల్లాలో మరో భారీ పరిశ్రమ

image

అచ్యుతాపురం ఎస్ఈజెడ్ పరిధిలో గల రాంబిల్లి మండలంలో సోలార్ పలకల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ మేరకు పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాలను కేటాయించింది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. రూ.3,990 కోట్ల పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేయనున్నారు. 2028 జనవరి నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

News December 12, 2025

అల్లూరి జిల్లాకు మొదటి స్థానం

image

ఇంటి పన్ను వసూలులో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉందని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ గురువారం కొయ్యూరులో తెలిపారు. 2025-26 సంవత్సరంతో పాటు ఎరియర్స్ తో కలిసి రూ.13.56కోట్ల బకాయి ఉందన్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు రూ.3.08కోట్లు వసూలు అయిందన్నారు. ఇంటి పన్ను వసూలులో జిల్లాలో కొయ్యూరు, జీ.మాడుగుల మండలాలు ముందంజలో ఉన్నాయన్నారు. డిజిటల్ పేమెంట్ సిస్టంలో పన్ను వసూలు చేస్తున్నామన్నారు.

News December 12, 2025

టీమ్ఇండియా చెత్త రికార్డ్

image

టీ20ల్లో 210+ పరుగుల ఛేదనలో భారత జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు 7 సార్లు ప్రత్యర్థి జట్లు 210+ స్కోర్లు చేయగా, అన్నింటిలోనూ భారత్ ఓడింది. నిన్న సౌతాఫ్రికా 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, 162 రన్స్‌కే టీమ్ఇండియా ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. 2023లో విశాఖలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో భారత్ 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటివరకు IND హయ్యెస్ట్ ఛేజింగ్ స్కోర్.