News January 17, 2026

సిద్దిపేట జిల్లా మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు

image

సిద్దిపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ఛైర్మన్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. సిద్దిపేటను బీసీ జనరల్‌కు, చేర్యాలను ఎస్సీ మహిళకు, హుస్నాబాద్‌ను ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. గజ్వేల్, దుబ్బాక స్థానాలు బీసీ మహిళలకు దక్కాయి. రిజర్వేషన్లు తేలడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొనగా, ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

Similar News

News February 15, 2026

INDvsPAK: టాస్ గెలిచిన పాక్.. భారత్ బ్యాటింగ్

image

T20WCలో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. కొలంబో వేదికగా కాసేపట్లో INDతో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌లోనూ ఇరు జట్ల కెప్టెన్లు సూర్య, సల్మాన్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు.
IND: అభిషేక్, ఇషాన్, తిలక్, సూర్య, హార్దిక్, దూబే, రింకు, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా
PAK: అయూబ్, ఫర్హాన్, సల్మాన్, బాబర్, నవాజ్, షాదాబ్, ఫహీమ్, ఉస్మాన్, షాహీన్, అబ్రార్, తారిఖ్

News February 15, 2026

ఉండవల్లిలో సీఎం పర్యటన.. పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్

image

సోమవారం ఉండవల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ముఖ్యమంత్రి ఉండవల్లి పర్యటనకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడా వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చూడాలని చెప్పారు.

News February 15, 2026

రేపు ప్రజావాణి రద్దు: నిర్మల్ కలెక్టర్

image

నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల దృష్ట్యా ఈ వారం ప్రజావాణిని రద్దు చేశామన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.