News February 13, 2025
సిద్దిపేట: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్ సెషన్ వన్ పరీక్ష ఫలితాల్లో హుస్నాబాద్ మండలంలోని జిల్లా గడ్డ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ రాజు తెలిపారు. సునీల్ 81.8%, సిద్ధార్థ 77.33%, మోక్షజ్ఞ 77.04%, విష్ణు 74.81%, అజయ్ 73.56%, ప్రేమ్ చరణ్ 71.96%, 16 మంది విద్యార్థులకు పైగా 60% మార్కులు సాధించారని తెలిపారు.
Similar News
News February 13, 2025
పల్నాడు: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. చికెన్, గుడ్ల ధరలపై ప్రభావం
గోదావరి జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి వదంతులతో చికెన్ తినాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. అయితే ఈ ఫ్లూ ప్రభావం ఉమ్మడి గుంటూరు జిల్లాపై ఎక్కడా లేదని, వదంతులు నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు. కాగా జిల్లాలో చికెన్ ధరలు రూ.50 వరకు తగ్గడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇటు గుడ్డు ధర కూడా రూ.4.50కి దిగివచ్చింది. మీ ఏరియాలో ధరలెలా ఉన్నాయి.
News February 13, 2025
కోడి పందేలు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌కు చెందిన మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో కోడి పందేలు కలకలం రేపాయి. ఈ క్రమంలో పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఫామ్ హౌస్ నిర్వహణపై ఆయనను విచారించనున్నారు.
News February 13, 2025
దుబాయ్‌లో భారత్, పాక్ దిగ్గజ క్రికెటర్ల సందడి
ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాల్లో భాగంగా భారత్, పాక్ దిగ్గజ క్రికెటర్లు కప్‌తో దుబాయ్‌లో సందడి చేశారు. ఓ ఈవెంట్లో పాల్గొన్న యువరాజ్, ఇంజమామ్, ఆఫ్రీదితో కలిసి దిగిన ఫొటోను నవజోత్ సింగ్ సిద్ధూ ట్వీట్ చేశారు. లెజెండ్స్ ఈజ్ బ్యాక్ అని, బెస్ట్ ప్లేయర్స్ అని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి CT హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు. భారత్ – పాక్ మ్యాచ్ 23న దుబాయ్‌లో జరగనుంది.