News March 12, 2025
సిద్దిపేట: జ్యోతిష్యం పేరుతో మోసం.. వ్యక్తి అరెస్ట్

జ్యోతిష్యం పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేసిన నిందితుడిని మద్దూర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చేర్యాల పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీను మాట్లాడుతూ.. జీ టీవీలో జ్యోతిష్యం చెప్తాను అనే ప్రకటన నమ్మి రూ.50 వేలను నారాయణ చారి ఇచ్చాడు. పూజ మధ్యలో ఉంది తిరిగి మరో రూ.50 ఇవ్వాలని చెప్పడంతో ఫోన్ పే ద్వారా డబ్బులు పంపాడు. తిరిగి మళ్లీ డబ్బులు పంపాలని అడగగా 1930ను ఆశ్రయించాడు.
Similar News
News March 12, 2025
NGKL: మహిళ ఆత్మహత్య.. వ్యక్తి అరెస్ట్.!

అచ్చంపేట పట్టణంలో ఈనెల 6న చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందిన ఆవుల లక్ష్మి (37) కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. మృతురాలి తండ్రి మేకల నిరంజన్ ఫిర్యాదు మేరకు పట్టణానికి చెందిన బుద్దుల పర్వతాలు అనే వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం అచ్చంపేట కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు తెలిపారు.
News March 12, 2025
అనకాపల్లి: ఇంటర్ పరీక్షలకు 325 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 325 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. జనరల్, ఒకేషనల్ గ్రూపులకు సంబంధించి మొత్తం 12,481 విద్యార్థులకు గాను 12,156 మంది హాజరు అయినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నట్లు తెలిపారు.
News March 12, 2025
జొమాటో, స్విగ్గీకి పోటీగా ర్యాపిడో ఫుడ్‌డెలివరీ!

బైక్ ట్యాక్సీ కంపెనీ ర్యాపిడో త్వరలో ఫుడ్ డెలివరీ వ్యాపారంలోకి ప్రవేశించబోతోందని సమాచారం. ఇప్పటికే రెస్టారెంట్లతో చర్చలు ఆరంభించిందని తెలిసింది. జొమాటో, స్విగ్గీ వసూలు చేసే ప్రస్తుత కమీషన్ల ప్రక్రియను సవాల్ చేసేలా కొత్త బిజినెస్ మోడల్‌ను రూపొందిస్తోందని ఒకరు తెలిపారు. కొన్ని ఏరియాల్లో తమ టూవీలర్ ఫ్లీట్‌తో ఇండివిడ్యువల్ రెస్టారెంట్ల నుంచి ఇప్పటికే ఫుడ్ డెలివరీ చేస్తున్నట్టు తెలిసింది.