News February 17, 2025
సిద్దిపేట: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో..!

MDK-KNR-NZB-ADB టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా భావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Similar News
News November 11, 2025
కేటిదొడ్డి: బావిలో అనుమానాస్పద మృతదేహం

కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామ పరిధిలోని ఓ బావిలో మంగళవారం అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పైకి తీశారు. మృతదేహంపై అనుమానాస్పద గాయాలు ఉన్నాయని గ్రామస్థులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 11, 2025
బిహార్, జూబ్లీహిల్స్‌లో ముగిసిన పోలింగ్

బిహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌తో పాటు TGలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. బిహార్‌లో ఈనెల 6న 121 స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరగగా 65.08% పోలింగ్ నమోదైంది. ఇవాళ 122 స్థానాలకు సా.5 గంటల వరకు 67.14% ఓటింగ్ రికార్డయింది. జూబ్లీహిల్స్‌లో సా.5 గంటల వరకు 47.16% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ సమయం ముగిసినా సా.6లోపు లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తారు.
News November 11, 2025
త్వరలో ఆర్డీటీకి శుభావార్త!

గ్రామీణ పేదల ఆశాదీపం ఆర్డీటీ సంస్థకు మళ్లీ విదేశీ నిధులు అందనున్నాయి. నాలుగేళ్లుగా నిలిచిపోయిన FCRA లైసెన్సు రెన్యువల్ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. FCRA రెన్యవల్ విషయమై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హోం మంత్రి అమిత్ షాతో పలుమార్లు చర్చించారు. జిల్లా ఎమ్మెల్యేలు సైతం అమిత్ షాను కలిసి ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు.


