News March 13, 2025
సిద్దిపేట: టీజీఐఐసీ భూముల సేకరణపై కలెక్టర్ సమీక్ష

సిద్దిపేట కలెక్టరేట్లో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGIIC) వారికీ కేటాయించిన భూముల భూసేకరణ ప్రక్రియ గురించి జిల్లా టీజీఐఐసీ, రెవెన్యూ, సర్వే అధికారులతో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి కలెక్టర్ ఎం.మను చౌదరి సమీక్ష నిర్వహించారు. టీజీఐఐసీకి కేటాయించిన భూముల భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
Similar News
News March 13, 2025
దేవరకద్ర: చికిత్స పొందుతూ మహిళ మృతి

దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలానికి చెందిన నీలి నాగన్న కూతురు దండు మంగమ్మ మంగళవారం కూలీ పనులకు వెళుతుండగా కారు ఢీ కొనగా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News March 13, 2025
ఆదిలాబాద్: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

డిగ్రీ పాసైన BC అభ్యర్థులకు బ్యాంకింగ్&ఫైనాన్స్‌లో ఫ్రీ ట్రైనింగ్,ఉద్యోగం కల్పించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా BC అభివృద్ధి అధికారి రాజలి,స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. ట్రైనింగ్ పూర్తైన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్‌మెంట్ కల్పిస్తారన్నారు.అర్హులు ఈనెల 15 నుంచి www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఏజ్ లిమిట్-26లోపు.లాస్ట్ డేట్-ఏప్రిల్ 8. SHARE IT
News March 13, 2025
డిజిటల్ మోసాల్లో 83,668 వాట్సాప్ అకౌంట్లు బ్లాక్: బండి

డిజిటల్ అరెస్ట్ స్కాముల్లో 3,962 స్కైప్ ఐడీలు, 83,668 వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేసినట్లు హోంశాఖ వెల్లడించింది. సైబర్ నేరగాళ్లు ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీ అధికారులుగా నటిస్తూ మోసాలకు పాల్పడినట్లు రాజ్యసభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ డీఎంకే ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇప్పటివరకు సైబర్ నేరాలపై 13.36 లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయని చెప్పారు. సుమారు రూ.4,386 కోట్ల నష్టాన్ని నివారించినట్లు తెలిపారు.