News December 20, 2025
సిద్దిపేట: ట్రాన్సజెండర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఉపాధి పునరావాస పథకం కింద ట్రాన్స్ జెండర్‌లకు బుుణాల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్ జెండర్ సంక్షేమ అధికారి శారద తెలిపారు. జిల్లాకు మొత్తం 5 యూనిట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ట్రాన్స్ జెండర్‌ల కోసం ఈ పథకం కింద రూ.75 వేల పూర్తి సబ్సీడితో రుణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. www.wdsc.telangana.gov.in వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News December 23, 2025
కర్నూలు: తల్లి చేసిన పనికి అనాథలైన చిన్నారులు

కర్నూలు(D) ఆస్పరి(M) తొగలగల్లులో <<18638430>>దారుణం<<>> జరిగింది. 4 నెలల క్రితం ప్రియుడితో కలిసి భర్త అహోబిలాన్ని భార్య గంగావతి(30) గొంతు నులిమి చంపింది. ఈ కేసులో బెయిల్‌పై వచ్చిన గంగావతి భర్త స్వగ్రామమైన తొగలగల్లులో ఉంటోంది. దీన్ని మృతుడి తమ్ముడు పెద్దయ్య జీర్ణించుకోలేకపోయాడు. ఇంట్లో నిద్రిస్తున్న ఆమె తలపై రోకలి బండతో కొట్టడంతో మృతిచెందింది. అహోబిలం, గంగావతి మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
News December 23, 2025
ఆయిల్‌పామ్‌తో అధిక ఆదాయం.. సాగుకు సర్కారు ప్రోత్సాహం

తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. దేశీయ అవసరాల కోసం ఈ పంట సాగుకు ప్రభుత్వాలు మంచి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. కేవలం పామాయిల్‌తోనే కాకుండా దానిలో పసుపు, అల్లం, మిర్చి, మొక్కజొన్న, అరటి, కోకో, మిరియాలు వంటి అంతర పంటలతో అదనపు ఆదాయం పొందొచ్చు. ఈ పంట సాగుకు AP, తెలంగాణ ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 23, 2025
కృష్ణా: UPHS, PHCలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు DMHO యుగంధర్ తెలిపారు. UPHSలలో ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్ట్ ఒకటి, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు 7, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు10, PHCలలో ల్యాబ్ టెక్నిషియన్ 12, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 16, శానిటరీ అటెండర్ కం వాచ్‌మెన్ పోస్టులు 10 ఖాళీలకు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.


