News February 13, 2025

సిద్దిపేట: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఇద్దరికీ 3రోజుల జైలు శిక్ష

image

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఇద్దరికీ మూడు రోజుల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కాంతారావు తీర్పునిచ్చారని సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ బుధవారం తెలిపారు. కొద్దిరోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తాలలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురిని పట్టుకున్నారు. వీరికి రూ.8వేల జరిమానా విధించగా.. ముగ్గురికి జైలు శిక్ష విధించారు.

Similar News

News February 13, 2025

వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా కన్నబాబు

image

వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం కమిటీ ప్రకటన జారీ చేసింది. వైసీపీ హయాంలో కన్నబాబు మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో విశాఖ జిల్లా ఇన్‌ఛార్జిగా కూడా కొనసాగారు. వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో కన్నబాబు నియామకం చేపట్టారు.

News February 13, 2025

భూపాలపల్లి జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు!

image

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా చలి తగ్గి.. క్రమంగా ఎండ తీవ్రత పెరిగింది. దీంతో జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని అభిప్రాయపడుతున్నారు. పొలం పనులకు వెళ్లాలంటేనే ఎండలకు భయపడుతున్నారు. మరోవైపు జిల్లాలోని పలు చోట్ల చెక్ డ్యామ్‌లు, చెరువులు సైతం ఎండే పరిస్థితికి వచ్చింది. మీ ప్రాంతంలో ఎండ తీవ్ర ఎలా ఉందో కామెంట్ చేయండి.

News February 13, 2025

కొవ్వూరులో హీరో రామ్ సినిమా షూటింగ్

image

సినీ హీరో రామ్‌ పోతినేని 22వ సినిమా షూటింగ్‌ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో జరిగింది. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. మంగళవారం ఆరికిరేవుల స్నానఘట్టం, గోదావరి నది వద్ద సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో భాగంగా బుధవారం నటుడు రావు రమేశ్ తో పలు సీన్లు చిత్రీకరించారు.

error: Content is protected !!