News March 27, 2025

సిద్దిపేట: తండ్రి మందలించాడని.. కొడుకు ఆత్మహత్య

image

తండ్రి మందలించాడని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోహెడ (M) రాంచంద్రపూర్‌కు చెందిన సుంకరి నాగయ్య గొర్రెల కాపారి. ప్రశాంత్(19) ఇంటర్ వరకు చదివి ఖాళీగా ఉంటున్నాడు. ఏ పని చేయడం లేదని తండ్రి మందలించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రశాంత్ 21న పురుగు మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు KNR ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

Similar News

News November 2, 2025

డిప్యూటీ సీఎం పరిగి పర్యటన వాయిదా

image

పరిగి నియోజకవర్గంలో జరగాల్సిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన వాయిదా పడింది. ముందుగా సోమవారం జరగాల్సిన ఈ పర్యటన ఇప్పుడు బుధవారానికి జరుగనుంది. పరిగి పరిధిలో 400 KV, ఆరు 33/11 KV సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేసి, నజీరాబాద్ తండాలో 220 KV సబ్‌స్టేషన్ ప్రారంభించి, రూ.8 కోట్లు విలువైన వ్యవసాయ విద్యుత్ సామగ్రిని పంపిణీ చేసి, ప్రజా సమావేశంలో పాల్గొననున్నారు.

News November 2, 2025

అక్కయ్యపాలెంలో భార్యాభర్తలు సూసైడ్

image

విశాఖ ఫోర్త్ టౌన్ పరిధిలో ఆదివారం విషాదం నెలకొంది. అక్కయ్యపాలెం సంగం ఆఫీసు సమీపంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. మృతులు వాసు, అనితగా గుర్తించారు. అనిత ప్రస్తుతం ఏడో నెల గర్భిణిగా ఉందని సమాచారం. వారి మృతదేహాలను చూసి వాసు తల్లి సొమ్మసిల్లి పడిపోయారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు.

News November 2, 2025

నదుల పక్కన ఇంటి నిర్మాణాలు చేయవచ్చా?

image

వాగులు, నదుల పక్కన ఇల్లు కట్టుకోవద్దని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. జల ప్రవాహాలు ఎక్కువైతే.. ఆస్తి, ప్రాణ నష్టం కలిగే ప్రమాదం ఉందన్నారు. ‘నీటి ఒత్తిడి వల్ల పునాదుల బలం తగ్గి, ఇంట్లో స్థిరత్వం లోపిస్తుంది. ప్రకృతి శక్తుల వైపరీత్యం నుంచి ఇల్లు సురక్షితంగా ఉండాలంటే, వరుణ దేవుని ఆగ్రహానికి గురికావొద్దంటే ఈ స్థలాలను నివారించాలి. భద్రత కోసం వీటికి దూరంగా ఉండటం ఉత్తమం’ అని చెప్పారు. <<-se>>#Vasthu<<>>